ETV Bharat / state

నేటి నుంచి వృద్ధులకు కొవిడ్​ వ్యాక్సిన్​ - నేటి నుంచి రెండోదశ వ్యాక్సినేషన్​

రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్.. నేడు ప్రారంభం కానుంది. 60 ఏళ్లు నిండినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి... ప్రభుత్వం గుర్తించిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా ఇవ్వనున్నారు. తొలిరోజు 93 కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే టీకా వేయనున్నారు.

నేటి నుంచి కరోనా టీకా.. ఎవరికి అంటే...
నేటి నుంచి కరోనా టీకా.. ఎవరికి అంటే...
author img

By

Published : Mar 1, 2021, 5:01 AM IST

దేశ చరిత్రలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి ప్రభుత్వం గుర్తించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 లక్షలకుపైగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధుల బాధితులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. స్తోమత ఉండి త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ టీకా సౌకర్యం కల్పించారు.

పూర్తైన ఏర్పాట్లు

కేంద్ర ఆరోగ్య పథకాలు, ఆరోగ్య శ్రీ అనుబంధంగా ఉన్న 215 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు టీకా ఇచ్చేందుకు అనుమతులు జారీ చేసింది. అయితే తొలి రోజు మాత్రం ప్రైవేట్‌లో కేవలం 45 కేంద్రాల్లో వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రభుత్వ విభాగంలో 48 చోట్ల వాక్సినేషన్ ఏర్పాట్లను పూర్తి చేశారు. తొలుత 1500 కేంద్రాల్లో టీకా వేయాలని నిర్ణయించినా... గందరగోళానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో ఆ సంఖ్యను 93కు కుదించారు. ఒక్కో కేంద్రంలో గరిష్ఠంగా 200 మందికి ఇవ్వాలని నిర్దేశించుకున్నారు.

రోజుకు లక్షమందికి

తొలి రోజు తక్కువ కేంద్రాల్లో టీకా పంపిణీ ఏర్పాట్లు చేసిన సర్కారు... క్రమంగా కేంద్రాల సంఖ్య పెంచనుంది. రోజుకు కనీసం లక్ష మందికి టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు ముందుగా కొవిన్‌ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. మధ్యాహ్నం 3 గంటల లోపు రిజిస్టర్ చేసుకున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఆధార్ నెంబర్ లేక చరవాణి నెంబర్‌లతో కొవిన్‌లో రిజిస్టర్ చేసుకున్నవారికి లింక్‌ పంపనున్నారు. ఆ లింక్ ఆధారంగా దగ్గరలోని వ్యాక్సిన్ కేంద్రంలో టీకా తీసుకోవడంతోపాటు రెండో డోస్ కోసం అదే రోజు తేదీని ఖరారు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌లోనే వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రం పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

ఇవి తప్పనిసరి..

వాక్సిన్ కేంద్రాలకు 60 ఏళ్లు పైబడినవారు... పాస్‌పోర్ట్ ఫోటో, ఆధార్ కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదో ఒక ప్రభుత్వం గుర్తించిన ఫోటో ఐడీ కార్డు ఒరిజినల్‌ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు తప్పక ప్రభుత్వం ఆమోదించిన విధంగా గుర్తింపు పొందిన వైద్యుడి నుంచి ధ్రువపత్రం తీసుకువస్తేనే వ్యాక్సిన్ పొందేందుకు అర్హులని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

తొలిరోజు వారికి మాత్రమే..

తొలిరోజు కేవలం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇవ్వనున్న సర్కారు... త్వరలో స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా టీకా అందించనుంది.

ఇదీ చూడండి: నేటి నుంచి కొ-విన్​2.0 పోర్టల్​ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.