వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రిటర్నింగ్, సహాయక రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. మొత్తం 150 డివిజన్లకు గాను.. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకాలను ప్రకటించగా.. మరో 61 మంది రిటర్నింగ్, 71 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను రిజర్వ్‌లో ఉంచనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 30 సర్కిళ్లలో ఎన్నికల అధికారుల నియామకాలు పూర్తవగా.. ఇక గ్రేటర్ పోరుకు షెడ్యూల్ త్వరలో వెలువడనుంది.
ఇవీ చూడండి: దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పోలీస్ పరిశీలకుడుగా సరోజ్ ఠాకూర్