ETV Bharat / state

'మహిళా భద్రతే లక్ష్యంగా షీ టీమ్స్​కు స్కూటీల పంపిణీ'

హైదరరాబాద్​ అత్యంత భద్రతతో కూడిన నగరమని హోం మంత్రి మహమూద్​ అలీ అన్నారు. మహిళలు, చిన్నారులు, యువతుల భద్రత కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. సేఫ్​ సిటీ ప్రాజెక్టులో భాగంగా 60 స్కూటీలను షీ టీమ్స్​ పోలీసులకు కేటాయించారు.

scooties distribution to she teams
షీ టీమ్స్​కు స్కూటీల పంపిణీ
author img

By

Published : Apr 19, 2021, 5:59 PM IST

రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల భద్రతే ప్రధాన లక్ష్యమని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా షీ టీమ్స్ పోలీసుల కోసం ప్రభుత్వం సమకూర్చిన స్కూటీలను హైదరాబాద్​లోని గోషామహల్ స్టేడియంలో ఆయన ప్రారంభించారు. షీ టీమ్స్ కోసం మొత్తం 60 స్కూటీలను ప్రభుత్వం సమకూర్చగా అందులో హైదరాబాద్ కమిషనరేట్​ కోసం 27, రాచకొండ 16, సైబరాబాద్​కు 17 స్కూటీలను కేటాయించారు. ఈ స్కూటీలపై షీ బృందాలు సాధారణ పౌరులుగా గస్తీ నిర్వహించనున్నారు.

పనితీరు అద్భుతం..

ప్రస్తుతం షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని... ఈ స్కూటీలతో చిన్న చిన్న గల్లీల్లోకి కూడా వెళ్లి గస్తీ చేసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. మహిళలు, యువతులు, చిన్నారులకు ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించే వీలుంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ అత్యంత భద్రతతో కూడిన నగరమని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, అదనపు సీపీ చౌహన్, సైబరాబాద్ షీటీమ్స్ డీసీపీ అనసూయ తదితరులు పాల్గొన్నారు.

'మహిళా భద్రతే లక్ష్యంగా షీ టీమ్స్​కు స్కూటీల పంపిణీ'

ఇదీ చదవండి: 'ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.