హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్-బయోనెస్ట్ ఇంక్యుబేషన్ కేంద్రం సహకారంతో రియజిన్ కంపెనీ నడుస్తోంది. దీనికి సీఈవోగా వంగాల సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తుండగా... సహా వ్యవస్థాపకులుగా ఉదయ్ సక్సేనా ఉన్నారు. మరోవైపు పెన్సిల్వేనియా వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ సుశాన్ వైజ్ ఆధ్వర్యంలో ప్రొడిజీ కంపెనీ కొనసాగుతోంది. ఈ రెండు సంస్థలు కలిసి కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన చికిత్స విధానాలను కనుగొంటారు.
వెంటిలేటర్ల తయారీలో హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులు...
కొవిడ్-19 రోగుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన వెంటిలేటర్లను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు వెంకట రాహుల్, రజినీకాంత్ సబ్నేకర్ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రొటోటైప్ (నమూనా) రూపొందించి పరీక్షించారు. కన్జర్‌విజన్ టెక్నాలజీ పేరిట హార్డ్‌వేర్ అంకుర సంస్థను రాహుల్ ప్రారంభించారు.
దీనికి హెచ్‌సీయూలోని టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (టైడ్) సహాయ సహకారాలు అందిస్తోంది. కన్జర్‌విజన్ టెక్నాలజీ తరఫున తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న టి-వర్క్స్‌తో భాగస్వామ్యంతో పనిచేస్తూ వెంటిలేటర్లను తయారు చేస్తున్నారు. వీటి ధర రూ.65 వేల నుంచి రూ.లక్ష మధ్య ఉండే అవకాశం ఉందని రాహుల్ తెలిపారు.