విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్ ఫేర్ ఎంతో దోహదపడతంది. హైదరాబాద్ బండ్లగూడలోని ఇందూ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫేర్ నిర్వహించింది. 850 మంది విద్యార్థులు 450 ప్రదర్శనలతో తమ ప్రతిభను చాటారు.
నూతన ఆవిష్కరణలను చేసేందుకు
చేతి వృత్తులు, సోలార్ పవర్ ప్లాంట్, కరెన్సీ తయారీ, వివిధ పార్టీల గుర్తులతో ఈవీఎం నమూనా, రాజ్యసభ, లోక్ సభ, భువనగిరి పోర్ట్, సింగరేణి మొదలైన నమూనాలను విద్యార్థులు ప్రదర్శించి, వివరించారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థులు నూతన ఆవిష్కరణలను చేసేందుకు వీలుంటుందని పాఠశాల ప్రిన్సిపల్ అన్నారు.
ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్‌సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి