శాస్త్ర విజ్ఞాన రంగంలో పరిశోధనలు పెరగాల్సిన అవసరం ఉందని.. సైన్స్ ఆవిష్కరణలు... రైతులు, సగటు భారతీయుని అభ్యున్నతికి ఉపయోగపడాలని సైన్స్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్లో వక్తలు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 107వ భారత సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు. సైన్స్ కాంగ్రెస్లో సైన్సే మాట్లాడుదాం అంటూ.. రౌండ్ టేబుల్లో హాజరైన ప్రముఖులు పేర్కొన్నారు.
విజ్ఞానరంగంపై వెచ్చించాల్సిన నిధులు పెంచాల్సిన అవసరం ఉందని.. దేశీయ అవసరాలు ఎలా ఉన్నాయి.. దేశానికి ఎటువంటి శాస్త్రీయ పరిశోధనలు అవసరం వంటి విషయాలపై లోతుగా చర్చించాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: పాల ప్యాకెట్లు దొంగలిస్తూ... దొరికిపోయారు...!