ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం బీఆర్కే భవన్లో సమావేశమైంది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్, సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ప్రైవేటు పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. మౌలిక వసతుల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన సిఫార్సులను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించాలని ఉపసంఘం నిర్ణయించింది.
ఇదీ చదవండి: Etela: హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు ఘనస్వాగతం