పాఠశాల టీచర్ తిట్టిందని మనస్తాపం చెంది గత నెలలో ఓ ప్రైవేట్ స్కూల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థి మహేశ్ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందాడు. జయప్రకాష్ నగర్‌కు చెందిన మహేశ్ 8వ తరగతి చదువుతున్నాడు. గత నెల 29వ తేదీన అదే స్కూల్ భవనం పైనుంచి కిందపడ్డాడు. టీసీ ఇచ్చి పంపిస్తానని టీచర్ అనడం వల్లే భయపడి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ప్రమాదవశాత్తు కాలిజారి కింద పడ్డాడని స్కూలు యాజమాన్యం చెబుతోంది.
ఇదీ చూడండి: డీఐజీనంటూ బురిడీ... ఎన్నోరోజులు సాగలేదీ గారడీ