IPL Matches in Hyderabad Uppal Stadium : వేసవిలో వినోదాన్ని పంచేందుకు ఐపీఎల్ రానేవచ్చింది. నేటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌కు తెరలేవనుంది. క్రికెట్ అభిమానులకు మజాను అందించేందుకు పది జట్లు సన్నద్ధమయ్యాయి. ఈ సంవత్సరం ఐపీఎల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొత్త నిబంధనలను తెచ్చింది. వైడ్, నోబాల్‌కు సమీక్ష, టాస్ తర్వాత తుది జట్టు ప్రకటన, ఇంఫాక్ట్ ప్లేయర్.. ఇలా ఎన్నో కొత్త అంశాలను ఈ సీజన్‌లో చూడబోతున్నాం. ఇదిలా ఉంటే మూడేళ్ల తర్వాత ఈసారి భాగ్యనగరంలోను క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.
హాట్‌కేకుల్లా అమ్ముడైపోయిన టికెట్లు : ఐపీఎల్ కోసం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ముస్తాబైంది. మ్యాచ్‌ల నిర్వహణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 2న సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నాం 3:30గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కిి సంబంధించిన టికెట్లు అన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. ఉప్పల్ మైదానంలో మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి.
ముస్తాబైన ఉప్పల్ స్టేడియం : కరోనా కారణంగా 2019 తరువాత ఈ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు జరగనుండటంతో క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ నేపథ్యంలో స్టేడియాన్ని రంగురంగులతో ముస్తాబు చేశారు. క్రికెట్ అభిమానులు కూర్చునే సీట్లను శుభ్ర పరిచారు. అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ ఉన్నతాధికారులు, హెచ్‌సీఏ అన్ని ఏర్పాట్లు చేసింది. మూడేళ్ల తర్వాత భాగ్యనగరంలో ఐపీఎల్ ఫీవర్ నెలకొంది. దాంతో క్రికెట్ అభిమానులలో కొత్త జోష్ నింపనుంది. ఇప్పటికే ఉప్పల్ జరిగే మొదటి మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోగా మిగతా మ్యాచ్‌లకు టికెట్ల విషయంలో డిమాండ్ ఏర్పడింది. మొత్తం ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు.
52 రోజుల పాటు ఉర్రూతలూగించనున్న ఐపీఎల్ : చాలా రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు భాగ్యనగరంలో జరుగుతుండడంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం మరోసారి ఫ్యాన్స్ కేరింతలతో మురిసిపోనుంది. లీగ్ దశలో సన్‌రైజర్స్ జట్టు ఆడే 14 మ్యాచ్‌లలో ఏడు మ్యాచ్‌లు హైదరాబాద్‌లో మరో ఏడు మ్యాచ్‌లు బయట ఆడనుంది. 52 రోజుల పాటు జరగనున్న ఐపీఎల్ 16వ సీజన్‌లో పది జట్లు పాల్గొంటుండగా మొత్తం 70 మ్యాచులు జరగనున్నాయి. వీక్ డేస్‌లో ఒక మ్యాచ్ జరగనుండగా.. ప్రతి శని, ఆదివారాల్లో వివిధ ప్రాంతాలలో రెండు మ్యాచులు జరగనున్నాయి. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌తో పాటు మన హైదరాబాదీ జట్టు ఆడే మ్యాచ్‌ల వివరాల ఈ విధంగా ఉన్నాయి.
ఇవీ చదవండి: