ETV Bharat / state

ఎస్సీ సంక్షేమ నిధులను సకాలంలో ఖర్చు చేయాలి: కొప్పుల - Koppula on SC welfare funds

హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో జరిగిన ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.

ఎస్సీ సంక్షేమ నిధులను సకాలంలో ఖర్చు చేయాలి: కొప్పుల

author img

By

Published : Mar 16, 2021, 4:46 AM IST

రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి నిధులను సకాలంలో ఖర్చు చేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో జరిగిన ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

కేటాయించిన నిధులు, ఖర్చుల వివరాలను అధికారుల్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. సాధారణ బడ్జెట్ ఖర్చుతో పోల్చితే కొన్ని విభాగాల్లో ఖర్చు తక్కువగా ఉందని... ఈ నెలాఖరు నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధికి సంబంధించి ఈ ఏడాదికి రూ.10 వేల కోట్లు ఖర్చు అయ్యాయి.

ఎస్సీఎస్​డీఎఫ్​ను ఈ ఏడాది కరోనా ప్రభావిత, కరోనా ప్రభావితేతరంగా విభజించారు. కరోనా ప్రభావిత విభాగాలైన విద్య తదితర శాఖల్లో డిసెంబరు వరకు తక్కువగా... వైద్యం, పౌరసరఫరాలు, విపత్తు నిర్వహణలో భారీగా ఖర్చు పెరిగింది. కొన్ని విభాగాల్లో ఖర్చు తక్కువగా ఉండటానికి గల కారణాలను కొప్పుల అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: రాజన్న బిడ్డ షర్మిలకు నా సంపూర్ణ మద్దతు: ఏపూరి సోమన్న

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.