ETV Bharat / state

చాదర్​ఘట్​ ఘటనను సుమోటోగా తీసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్​ - చాదర్​ఘట్​ ఘటనను సుమోటోగా తీసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్​

రాష్ట్ర రాజధానిలో జరిగిన ఆత్యాచార ఘటనను ఎస్సీ, ఎస్టీ కమిషన్​ సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు కమిషన్​ ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

sc, st commission taken chadharghat case as sumoto
చాదర్​ఘట్​ ఘటనను సుమోటోగా తీసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్​
author img

By

Published : May 8, 2020, 5:35 PM IST

హైదరాబాద్​ చాదర్​ఘట్ పోలీసు స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సుమోటాగా స్వీకరించారు. ఘటనపై వెంటనే విచారణ చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సూచించారు.

రెవెన్యూ అధికారులతో మాట్లాడి... బాధితురాలికి పరిహారం అందించాలని తెలిపారు. న్యాయం జరిగేవరకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచించారు.

ఇదీ చూడండి:భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.