SC Dismisses BRS Election Symbol Petitions : ఎన్నికల గుర్తులపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. కారును పోలిన గుర్తులు రద్దు చేయాలని వేసిన 2 పిటిషన్లను కొట్టి వేసింది. హైకోర్టు కొట్టివేసిన పిటిషన్‌పై ఆలస్యంగా వచ్చారని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అధికార పార్టీగా ఉండి 240 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారని ప్రశ్నించింది. పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
Lawmakers Immunity : చట్టసభ సభ్యులు అవినీతికి పాల్పడితే విచారణ నుంచి రక్షణ!
Supreme Court on BRS Election Symbol : రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులు రద్దు చేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్‌పై (BRS Petitions) .. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లు.. గుర్తులకు తేడా తెలియనంత నిరక్షరాస్యులు కాదని పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చాకే ఇలాంటివి గుర్తుకొస్తాయా అని అడిగింది. ఇలాంటి పిటిషన్లతో ఎన్నికల వాయిదా కోరుకుంటున్నారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరగా.. మెరిట్స్ ఆధారంగానే హైకోర్టు విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కారును పోలిన వాటిని ఎన్నికల గుర్తుల జాబితా నుంచి తొలగించాలంటూ ఇటీవలే దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఉపసంహరించుకుంది. కారును పోలిన ఆటో, చపాతీ రోలర్, రోడ్డు రోలర్ తదితర గుర్తులతో భారత్ రాష్ట్ర సమితి నష్టపోతోందని, వాటిని జాబితా నుంచి తొలగించాలని పార్టీ తరఫున దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ పురుషేంద్ర కౌరవ్ ఏకసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే కొన్ని కారణాల రీత్యా తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని, అందుకు అనుమతించాలని బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోడా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అందుకు న్యాయస్థానం అనుమతించింది.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ ఎంపీలు..: మరోవైపు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ ఎంపీల బృందం కలిసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని.. వారు సీఈసీకి విజ్ఞప్తి చేశారు. గతంలో ఇలాంటి గుర్తుల వల్ల తమ పార్టీకి రావాల్సిన ఓట్లు కోల్పోయినట్లు ఎంపీలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గతంలోనూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చినట్లు వివరించారు. ఇటీవల పలు గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించిన గుర్తుల్లో కారు గుర్తును పోలిన విధంగా ఉన్న వాటి విషయంలో పునః సమీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సీఈసీని కలిసిన వారిలో పార్టీ ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్ నేత, ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఉన్నారు.
'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. సిట్ విచారణ కొనసాగాల్సిందేనన్న సుప్రీంకోర్టు
ఓ రాజకీయ పార్టీ పిటిషన్‌ను హైకోర్టు ఎలా స్వీకరించింది: సుప్రీంకోర్టు