నల్లమల అటవీ ప్రాంతంలో చేపట్టబోతున్న యురేనియం తవ్వకాల వల్ల అనేక అనర్థాలు జరుగుతాయంటూ టాలీవుడ్ తారలు, కవులు, కళాకారులు గళమెత్తుతున్నారు. దీనివల్ల కలిగే అనర్థాల గురించి సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. #SaveNallamala #StopUraniumMining హ్యాష్ ట్యాగ్లు ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి.
ఇప్పటికే నీటి వనరుల విధ్వంసం జరిగిందని, వరదలు, కరవులు, తాగునీటి వనరులు కలుషితం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు మంచిది కాదని ఓ నటుడు పేర్కొంటే, నల్లమల తెలుగుప్రజలకు ఊపిరితిత్తుల్లాంటిదని మరో ప్రముఖ దర్శకుడు వ్యాఖ్యానించారు. దర్శకులు శేఖర్ కమ్ముల, నాగ్ అశ్విన్, వీవీ వినాయక్, సురేంద్రరెడ్డి, కవి గోరటి వెంకన్న, విప్లవ కవి నిఖిలేశ్వర్, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, చంద్ర సిద్ధార్థ, ఎల్.బి.శ్రీరాం, ఆర్పీపట్నాయక్, గాయత్రీ గుప్తా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తదితరులు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు.
నల్లమలను కాపాడుకుందాం : విజయ్ దేవరకొండ
ట్విట్టర్ వేదికగా నల్లమలను కాపాడుకుందామని యువ నటుడు విజయ్ దేవరకొండ సూచించారు. 20 వేల ఎకరాల నల్లమల అడవి నాశనమయ్యే ప్రమాదముందని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికే మనం నదులు, చెరువులను కలుషితం చేశామని పేర్కొన్నారు. తాగేందుకు నీరు దొరకని పరిస్థితికి వచ్చామని గుర్తుచేశారు. గాలి, నీరు కలుషితమవుతున్నాయన్నారు. కొన్ని నగరాలు నీళ్లు లేక అల్లాడుతున్నాయని తెలిపారు. యురేనియం కొనుక్కోవచ్చు, అడవులను కొనగలమా! అంటూ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: డియర్ కామ్రేడ్స్... నల్లమలను కాపాడుకుందాం
ఛేంజ్.ఆర్గ్‌లో పిటిషన్‌పై సంతకం చేసిన నటి సమంత
ప్రముఖ సినీనటి అక్కినేని సమంత నల్లమలను రక్షించండి అంటూ గళమెత్తింది. ట్విట్టర్ వేదికగా చేంజ్. ఆర్గ్‌లో ఉన్న పిటిషన్‌పై సంతకం చేసి నెటిజన్లతో షేర్ చేసుకుంది. తన ట్విట్టర్ ఖాతాలోని డీపీని సైతం సేవ్నల్లమల బొమ్మను పెట్టుకున్నారు.
-
President of India: Save Nallamala Forest from Uranium Mining - Sign the Petition! https://t.co/xVNFfPwJwZ via @ChangeOrg_India I have signed this petition .. have you ?
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">President of India: Save Nallamala Forest from Uranium Mining - Sign the Petition! https://t.co/xVNFfPwJwZ via @ChangeOrg_India I have signed this petition .. have you ?
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 13, 2019President of India: Save Nallamala Forest from Uranium Mining - Sign the Petition! https://t.co/xVNFfPwJwZ via @ChangeOrg_India I have signed this petition .. have you ?
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 13, 2019
జోగు రామన్నకు క్షమాపణ చెప్పిన అనసూయ
నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అనసూయ భరద్వాజ్ స్పందిచారు. నల్లమలను రక్షించాలంటూ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై స్పందించక పోవడంపై అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ట్యాగ్ చేయాల్సింది ఉంటగా.. మాజీ మంత్రి జోగు రామన్నను ట్యాగ్ చేశారు. తర్వాత నిజం తెలుసుకుని నేను కరెంట్ అఫైర్స్‌లో వీక్ అంటూ క్షమాపణ కోరారు.
-
Apologies for wrong tag Shri @JoguRamannaTRS .. Never thought I would one day feel the need so forgive my lack of knowledge on current affairs..Sir .. this is to address you Shri @IKReddyAllola Please consider my intention and not any other diversion🙏🏻🙏🏻 https://t.co/n8YFsd8lKS
— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Apologies for wrong tag Shri @JoguRamannaTRS .. Never thought I would one day feel the need so forgive my lack of knowledge on current affairs..Sir .. this is to address you Shri @IKReddyAllola Please consider my intention and not any other diversion🙏🏻🙏🏻 https://t.co/n8YFsd8lKS
— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 12, 2019Apologies for wrong tag Shri @JoguRamannaTRS .. Never thought I would one day feel the need so forgive my lack of knowledge on current affairs..Sir .. this is to address you Shri @IKReddyAllola Please consider my intention and not any other diversion🙏🏻🙏🏻 https://t.co/n8YFsd8lKS
— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 12, 2019