ETV Bharat / state

ప్రభుత్వ విద్యకు పట్టం కడతామన్నవారినే గెలిపించండి - acharya haragopal

ప్రభుత్వ విద్యకు నీళ్లొదిలి కార్పోరేట్​ విద్య అందళం ఎక్కించటం వల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందటం లేదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆరోపించిది.

ప్రభుత్వ విద్యను బతికించండి
author img

By

Published : Mar 26, 2019, 6:02 PM IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం అభివృద్ధిలో విఫలమయ్యాయని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆచార్య హరగోపాల్​ ఆరోపించారు. ఓటు వేయాలంటే కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని... ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని... కార్పొరేట్, ప్రైవేటు విద్యను నియంత్రిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన వారికే ఓటువేయాలను హరగోపాల్​ సూచించారు.

ప్రభుత్వ విద్యను బతికించండి

ఇదీ చదవండి:ముషీరాబాద్​లో తెరాస ఎన్నికల ప్రచారం

( ) ప్రభుత్వ విద్య బలోపేతానికి కార్పొరేట్ ప్రైవేట్ విద్య నియంత్రణ కై రాజకీయ పార్టీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో నిలదీయాలని తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ కోరింది. దేశంలో అటు ప్రధాని నరేంద్ర మోదీ ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాము విద్యారంగంలో ప్రజలకు మేలు చేస్తామని గొప్పలు చెప్పుకుని ...ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని కమిటీ ప్రధాన కార్యదర్శి ఆచార్య హరగోపాల్ విమర్శించారు. దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి గణనీయంగా జరుగుతుందని చెబుతున్న పాలకులు... విద్యారంగానికి మాత్రం నిధులు రోజురోజుకు తగ్గిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను విధ్వంసం చేస్తూ... కార్పొరేట్ విద్యాసంస్థల తో ప్రభుత్వాలు కుమ్మక్కవడం వల్లే వారు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగారని తెలిపారు. కనుక ప్రజలు పాలక పార్టీలను పోటీచేసే అభ్యర్థులను.... అటువంటి విద్యా వ్యతిరేక విధానాలను ఎందుకు తీసుకొచ్చారో జవాబు చెప్పాలని నిలదీయాలన్నారు. అదేవిధంగా తాము గెలిస్తే కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు విద్య కు కేటాయిస్తామని... ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని... కార్పొరేట్ ప్రైవేటు విద్యను నియంత్రిస్తామని లిఖిత పూర్వకంగా ప్రజల ముందు ప్రమాణం చేయాలని హరగోపాల్ కోరారు.

బైట్ : ఆచారి హరగోపాల్ ,తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.