ETV Bharat / state

Satyavathi Rathod Responded on Anganwadi Workers Protest : 'అంగన్​వాడీల రెగ్యులరైజేషన్ కేంద్రంతో ముడిపడి ఉంది' - Satyavathi respond Anganwadi Workers Protest

Satyavathi Rathod Responded on Anganwadi Workers Protest : అంగన్​వాడీ సిబ్బంది చేపట్టిన నిరసనలపై మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. అంగన్​వాడీల రెగ్యులర్ అనేది కేంద్రంతో ముడిపడి ఉందని చెప్పారు. త్వరలోనే వేతనాలు పెరగబోతున్నాయని స్పష్టం చేశారు. ఇకనైనా సమ్మె విరమించాలని అంగన్​వాడీలకు సత్యవతి రాఠోడ్ విజ్ఞప్తి చేశారు.

Anganwadi Workers Protest in Telangana
Satyavathi Rathod
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2023, 3:58 PM IST

Updated : Sep 22, 2023, 4:05 PM IST

Satyavathi Rathod Responded on Anganwadi Workers Protest in Telangana : తమ డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రంలో 11 రోజులుగా అంగన్​వాడీ కేంద్రాల సిబ్బంది ఆందోళన బాట (Anganwadi Workers Protest ) పట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. అంగన్​వాడీల సమస్యలపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అంగన్​వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మెకు దిగడం సరికాదని అన్నారు. పరిస్థితి అర్థం చేసుకుని సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తుందని సత్యవతి రాఠోడ్ వివరించారు.

Anganwadi Staff Strike in Telangana : అంగన్​వాడీల సమస్యలను కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు.. మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దిల్లీకి వెళ్తున్నారని సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాష్ట్రం పరిధిలో లేదన్నారు. పీఆర్​సీ ద్వారా అంగన్​వాడీల జీతాలు మరింత పెరుగుతాయని.. విధులు బహిష్కరించి సమ్మె చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. శాంతియుతంగా వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తే బాగుంటుందని సత్యవతి రాఠోడ్ ( Minister Satyavathi Rathod) సూచించారు.

Mid Day Meals Workers on Strike : సర్కారీ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నభోజనం బంద్‌.. ఎక్కడో తెలుసా?

Anganwadi Workers Protest in Telangana : రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను.. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్​గ్రేడ్ చేశామని సత్యవతి రాఠోడ్ గుర్తు చేశారు. అందులో పని చేసే సిబ్బంది పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచామని అన్నారు. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష.. మినీ అంగన్‌ వాడీ టీచర్లు, హెల్పర్​లకు రూ.50,000 ప్రత్యేక ఆర్థికసాయం అందిస్తున్నట్లు చెప్పారు. పీఆర్సీ కూడా వర్తింపజేసి అంగన్​వాడీ టీచర్ల వేతనం రూ.10,500 నుంచి రూ.13,650కు.. మినీ అంగన్​వాడీ టీచర్ల వేతనం రూ.6,000 నుంచి రూ.7,800లకు పెంచిన ఘనత కేసీఆర్ సర్కార్​దని వివరించారు. రూ.13,650లో.. కేంద్ర వాటా కేవలం రూ.4200 మాత్రమేనని.. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందనే విషయం ఉద్యోగులు గమనించాలని సత్యవతి రాఠోడ్ సూచించారు.

Satyavathi Rathod Responded on Anganwadi Workers Protest అంగన్​వాడీల రెగ్యులరైజేషన్ కేంద్రంతో ముడిపడి ఉంది

"అంగన్​వాడీల రెగ్యులర్ అనేది సాధ్యం కాదు. 9 లక్షల మంది ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చాం. సమ్మె విరమించాలని అంగన్​వాడీలకు విజ్ఞప్తి చేస్తున్నా. త్వరలో అంగన్​వాడీల వేతనాలు పెరగబోతున్నాయి. ఉద్యోగుల పీఆర్సీతో అంగన్​వాడీల వేతనాలు కూడా పెరుగుతాయి. ప్రతి నెల 14న జీతాలు ఇచ్చే ఏర్పాటు చేశాం. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న జీతాలు కూడా అంగన్​వాడీలు పరిశీలించాలి. అంగన్​వాడీలకు అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రమే ఎక్కువ వేతనం ఇస్తోంది. ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇస్తే పరిశీలిస్తారు. ఇకనైనా అంగన్​వాడీలు సమ్మె విరమించాలి." సత్యవతి రాఠోడ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి

Anganwadi Staff Strike in Mahabubnagar : అంగన్​వాడీల సమ్మెబాట.. కేంద్రాల్లో నిలిచిపోయిన సేవలు

మరోవైపు సమస్యల పరిష్కారానికై పోరుబాట పట్టిన అంగన్‌వాడీ సిబ్బంది నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ధర్నాలు చేపట్టారు. పోలీసులు కట్టడి చేసే క్రమంలో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Anganwadi Workers Protest in Telangana : వేతన పెంపు, క్రమబద్దీకరణ చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్​వాడీల నిరసనలు

Anganwadi Demands in Adilabad : అంగన్​వాడీల ఆందోళనల్లో ఉద్రిక్తత.. మహిళలపై చేయి చేసుకున్న పోలీసులు

Last Updated : Sep 22, 2023, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.