ETV Bharat / state

ఖైరతాబాద్ గంగపుత్ర సంఘం నూతన సారథిగా సత్యనారాయణ బెస్త ఎన్నిక - New President Poosa Satyanarayana latest News

హైదరాబాద్ ఖైరతాబాద్ పరిధిలోని తుమ్మల బస్తీ గంగపుత్ర సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాల్లో పూస సత్యనారాయణ బెస్త ప్యానెల్ హోరాహోరీ పోరులో విజయం సాధించింది. సమీప ప్రత్యర్థి బాబురావు బెస్తపై మూడు ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు.

ఖైరతాబాద్ గంగపుత్ర సంఘం నూతన సారథిగా సత్యనారాయణ బెస్త ఎన్నిక

author img

By

Published : Sep 23, 2020, 1:48 AM IST

హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని తుమ్మల బస్తీ గంగపుత్ర సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. ఫలితాల్లో పూస సత్యనారాయణ బెస్త ప్యానెల్ విజయం సాధించింది. అభ్యర్థులను పూస ధనరాజ్ బెస్త బలపరచగా.. అధ్యక్ష బరిలో పూస సత్యనారాయణ బెస్త, మదునాల బాబురావు బెస్త, పాశం వెంకటేష్ బెస్త బరిలో నిలిచారు. సాయంత్రం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో పూస సత్యనారాయణ బెస్త సమీప ప్రత్యర్థి బాబురావుపై మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

పోలైన మొత్తం ఓట్లు 322..

సంఘం పరిధిలో మొత్తం 322 ఓట్లు పోల్ అవ్వగా.. పూస సత్యనారాయణ 159 ఓట్లు పొందారు. 156 ఓట్లతో బాబురావు రెండో స్థానం దక్కించుకున్నారు. ఫలితంగా మూడు ఓట్ల తేడాతో బాబు రావు ఓటమి పాలయ్యారు. అనంతరం సంఘం కార్యాలయంలో సత్యనారాయణ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

యువత రాజకీయాల్లో రాణించాలి..

ఖైరతాబాద్ తుమ్మల బస్తీ గంగపుత్ర కులస్థుల అభివృద్ధికి, మత్స్య హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని సంఘం నూతన అధ్యక్షుడు సత్యనారాయణ స్పష్టం చేశారు. సంఘం కార్యకలాపాల్లో అందరినీ భాగం చేస్తూ.. కుల హక్కులను కాపాడుతామని పేర్కొన్నారు. గంగపుత్ర యువత విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రాణించి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు వారికి సంఘం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి : బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్​ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.