ETV Bharat / state

PSLV C-52 Launching: ఈనెల 14న.. నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-52 - ఇస్రో

Satish Dhawan Space Centre : భారత అంతరిక్ష రాకెట్ ప్రయోగ పరిశోధన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మొదటి ప్రయోగ వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సీ-52 వాహక నౌక ప్రయోగిచనున్నారు.

PSLV C-52 Launching
పీఎస్ఎల్వీ సీ-52
author img

By

Published : Feb 9, 2022, 2:19 PM IST

పీఎస్ఎల్వీ సీ-52

PSLV C-52 LAUNCHING ON 14TH : భారత అంతరిక్ష రాకెట్ ప్రయోగ పరిశోధన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈనెల 14న ఉదయం 5 గంటల 59 నిమిషాలకు..రాకెట్ దూసుకెళ్లనుంది. మొదటి ప్రయోగ వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సీ-52 వాహక నౌక ప్రయోగిచనున్నారు. వాహక నౌకలో 4 దశల అనుసంధానం పూర్తి చేసి ఇవాళ శిఖర భాగాన ఉష్ణ కవచం చేపట్టనున్నారు.

Satish Dhawan Space Centre : ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ ఈనెల 13న వేకువజామున 4 గంటల 29 నిమిషాలకు మొదలవుతుంది. నిరంతరాయంగా 25 గంటలు 30 నిమిషాలు కొనసాగాక వాహననౌక నింగిలోకి వెళ్లనుంది. పీఎస్ఎల్వీ సీ-52,ఐఆర్ -1ఏ తో పాటుగా ఐఎన్ఎస్ -2-టీడీ, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్ స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది.

ఇదీ చదవండి : TRS MPs on Modi: 'తెలంగాణ ప్రజల పోరాటాన్ని మోదీ అవమానించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.