ETV Bharat / state

'జాయింట్​ చెక్​పవర్​ దేశంలో ఎక్కడా లేదు' - కెసీఆర్

రాష్ట్ర సర్పంచ్​ల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని కాచిగూడలో రౌండ్​ టేబుల్​ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, భాజపా, తెదేపా, తెజస, లోక్​సత్తా నుంచి నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించాలని రాష్ట్ర సర్పంచ్​ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్ కోరారు.

జాయింట్​ చెక్​పవర్​ దేశంలో ఎక్కడా లేదు
author img

By

Published : Sep 20, 2019, 5:02 AM IST

Updated : Sep 20, 2019, 9:40 AM IST

'జాయింట్​ చెక్​పవర్​ దేశంలో ఎక్కడా లేదు'
హైదరాబాద్​లోని కాచిగూడలో సర్పంచ్​ల సంఘం ఆధ్వర్యంలో తమ సమస్యలపై రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, భాజపా నేత డీకే అరుణ, తెజస అధ్యక్షుడు కోదండరాం, తెదేపా నేత రావుల చంద్రశేఖర్​ రెడ్డి, లోక్​సత్తా నుంచి నరసింహరెడ్డి హాజరయ్యారు. జాయింట్ చెక్​పవర్ రద్దు చేయాలని, గ్రామపంచాయతీకి నేరుగా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర సర్పంచ్​ల సంఘం అధ్యక్షులు భూమన్న యాదవ్​ కోరారు. సర్పంచ్​లను సస్పెండ్ చేస్తామనే బెదిరింపు చర్యలు మానుకోవాలన్నారు. సర్పంచ్ గౌరవవేతనం రూ. ఐదు వేల నుంచి 20 వేల వరకు పెంచాలని, ఏకగ్రీవంగా ఎన్నికైన 2,134 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో సర్పంచ్​ల పరిస్థితి ఘోరంగా ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని జాయింట్ చెక్​పవర్ మన రాష్ట్రంలో ఉండడం కెసీఆర్ ఘనతేనని ఎద్దేవా చేశారు. సర్పంచ్, ఉప సర్పంచ్​కు జాయింట్​ చెక్ పవర్ ఇవ్వడం వల్ల భేదాభిప్రాయాలు వచ్చి ఏ విధమైన పనులు జరగవన్నారు భాజపా నేత డీకే అరుణ. నేటి పంచాయతీ వ్యవస్థలో గ్రామంలో కుక్క చచ్చిన, కోతి చచ్చిన, మొక్క చచ్చిన సర్పంచ్​లదే బాధ్యత అనే తీరు.. సరికాదని తెదేపా నేత రావుల చంద్రశేఖర్​ రెడ్డి అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు జవాబుదారిగా ఉంటారని.. అలా కాకుండా పంచాయతీ అధికారాలు మొత్తం కలెక్టర్​కు అప్పజెప్పడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికాదని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని.. లేకుంటే తమ కార్యాచరణను అక్టోబర్ 2 నుంచి ఉద్ధృతం చేస్తామని సర్పంచ్​ల సంఘం హెచ్చరించింది.

ఇవీ చూడండి: చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య

Intro:Body:Conclusion:
Last Updated : Sep 20, 2019, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.