హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో వైరస్ నిర్ధరణ కేంద్రాలకు తాకిడి పెరిగింది. మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా టెస్టింగ్ సెంటర్‌లో రోజుకి 200 మందికి పరీక్ష చేసే సామర్థ్యం ఉంది.
అంతకుమించి ప్రజలు రావడంతో వైద్యులతోపాటు వైరస్ అనుమానితులు కూడా ఇబ్బందికి గురవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి నిర్ధరణ పరీక్ష కోసం జనాలు బారులు తీరుతున్నారు.
ఇదీ చదవండి : ఓఆర్ఆర్పై మంత్రి వాహనం బోల్తా.. ఒకరు దుర్మరణం