సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు నేటి నుంచి మూడు రోజులపాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
లింగపల్లి, సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ వరకు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాకినాడ టౌన్ వరకు జన్సాధారణ్ స్పెషల్ రైళ్లు 11, 12, 13వ తేదీ రాత్రి 8గంటల 45నిమిషాలకు లింగంపల్లి నుంచి బయలుదేరుతాయని ఎస్‌సీఆర్ అధికారులు వివరించారు. సికింద్రాబాద్ నుంచి రాత్రి 9గంటల 30నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8గంటల 15నిమిషాలకు కాకినాడ టౌన్ చేరుకుంటుందన్నారు. దక్షిణ మధ్య రైల్వేశాఖ కల్పిస్తున్న ప్రత్యేక సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: దయచేసి వినండి మీరు వెళ్లాల్సిన రైళ్లన్ని రద్దీగా ఉన్నాయి!