ETV Bharat / state

శానిటైజర్ వాడండి.. కానీ బండిలో పెట్టుకుని తిరగకండి..! - రాజమహేంద్రవరంలో శానిటైజర్​లో మంటలు న్యూస్

ప్రస్తుతం శానిటైజర్ చాలా ముఖ్యం... కరోనా వ్యాప్తి నివారణలో అదో ఆయుధం. కానీ దానిని కూడా జాగ్రత్తగా వాడితేనే మంచిది. ఎక్కడ పడితే.. అక్కడ పెట్టడం చాలా ప్రమాదం.. ఒక్కోసారి అది మండిపోవచ్చు కూడా. ఆంధ్రప్రదేశ్​ రాజమహేంద్రవరంలో అదే జరిగింది.

sanitizer-fire-in-east-godavari-district-rajamahendravaram
శానిటైజర్ వాడండి.. కానీ బండిలో పెట్టుకుని తిరగకండి..!
author img

By

Published : Jun 25, 2020, 9:58 PM IST

శానిటైజర్ వాడండి.. కానీ బండిలో పెట్టుకుని తిరగకండి..!

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శానిటైజర్ ఫైర్ అయింది. దేవీ చౌక్ సెంటర్​లో ఓ వ్యక్తి తన బైక్​ను పార్క్ చేశారు. వాహనంలో ఉన్న శానిటైజర్... ఒక్కసారిగా మండిపోయి.. మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో అర్థంగాక సమీపంలో ఉన్న వాళ్లు పరుగు అందుకున్నారు. వాహనదారుడు స్థానికుల సాయంతో మంటలను అదుపుచేశారు.

ఇప్పుడు శానిటైజర్ ప్రతి ఒక్కరూ చేతులకు రాసుకోవడం తప్పనిసరైంది. కరోనా వ్యాప్తి కారణంగా.. పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే శానిటైజర్ చేతులకు రాసుకున్న తర్వాత మండే స్వభావం ఉన్న.. వాటి దగ్గరకు వెళ్లకపోవడమే మంచిది. శానిటైజర్లలోని ఆల్కాహాల్ కంటెంట్​కు మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ పదార్థాన్ని బయటకు తీసుకెళ్లినా.. వేడిగా ఉన్న ప్రదేశంలో పెట్టకపోవడం ఉత్తమం. జాగ్రత్త తీసుకునే క్రమంలో.. అజాగ్రత్తగా ఉంటే.. అసలుకే ముప్పు రావచ్చు.

ఇదీ చూడండి: రష్యా అధ్యక్షునిగా కొనసాగేందుకు పుతిన్​కు లైన్​ క్లియర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.