తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్- టీటా అధ్యక్షుడిగా సందీప్ మక్తాల మరోసారి ఎన్నికయ్యారు. ప్రస్తుతం టీటా గ్లోబల్ కమిటీ డిసెంబర్ 31తో ముగిసిపోగా పాలకమండలికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు సందీప్ మక్తాల మరోసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నాలుగో సారి అధ్యక్షుడిగా సందీప్ మక్తాల కొనసాగనుండగా ఉపాధ్యక్షుడిగా రాణాప్రతాప్ బొజ్జం, ప్రధాన కార్యదర్శులుగా అశ్విన్ చంద్ర వల్లబోజు నవీన్ చింతల, కోశాధికారిగా రవిలేల్ల ఎంపికయ్యారు.
రెండేళ్ల పాటు ఈ కమిటీ కొనసాగనుంది. తన నాయకత్వానికి మద్దతు తెలిపిన అసోసియేషన్ సభ్యులకు సందీప్ బృందం కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రెండేళ్లు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : వాట్సాప్,టెలిగ్రామ్, సిగ్నల్... ఏది సేఫ్?