రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసు హైకోర్టుకు చేరింది. గతేడాది నవంబర్ 24న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో సమతపై షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూంలు అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో ఆదిలాబాద్ జిల్లా కోర్టు వీరికి ఉరి శిక్ష వేస్తూ గత నెల తీర్పు వెలువరించింది. ఈ శిక్షను ఖరారు చేసేందుకు కింది కోర్టు ఈ కేసును హైకోర్టుకు నివేదించింది. కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ హైకోర్టుకు పంపింది.
జిల్లా కోర్టు నుంచి వచ్చిన రెఫరల్ కేసుపై హైకోర్టు విచారణ చేపట్టి.. దోషులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. ఇదే సమయంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అప్పీలు చేసుకోవటానికి దోషులకు అవకాశం ఉన్నప్పటికీ... వారు ఇప్పటివరకు ఎలాంటి అప్పీళ్లు దాఖలు చేయలేదు.
ఇవీ చూడండి: సమత హత్యోదంతం... అమానవీయం