హైదరాబాద్ మాదాపూర్‌లోని సమాన ఫ్యాషన్ డిజైన్ కాలేజి విద్యార్థులు స్వయంగా రూపొందించిన వస్త్రాలతో అదరహో అనిపించారు. తమ సృజనాత్మకతతో చూపరులను ఆకట్టుకున్నారు. విభిన్న రకాలైన డిజైన్లు ధరించి... ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో హోయలొలికించారు.
విద్యార్థులకు చక్కటి వేదికను అందించాలనే ఉద్దేశంతో ఈ షోను నిర్వహించినట్లు కాలేజి యాజమాన్యం పేర్కొంది. ఫ్యాషన్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని... నైపుణ్యతను విభిన్న కోణంలో ప్రదర్శిస్తే ఈ రంగంలో రాణించవచ్చని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'బిగిల్' భామకు గ్లామర్ పాత్రలంటే నచ్చదంట..!