ETV Bharat / state

మళ్లీ ప్రత్యక్షమైన సాలు దొర సెలవు దొర బోర్డు, ఈసారి కల్వకుంట్ల పేరుతో

bjp digital board on kcr భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద సాలు దొర సెలవు దొర బోర్డును మళ్లీ ఏర్పాటు చేశారు. ఈసారి సీఎం కేసీఆర్​ బొమ్మ లేకుండా కల్వకుంట్ల కౌంట్​డౌన్​ పేరుతో బోర్డు పెట్టారు. కార్యకర్తల కోరిక మేరకు కేసీఆర్ బొమ్మ తొలగించి మళ్లీ బోర్డును ఏర్పాటు చేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్​రెడ్డి స్పష్టం చేశారు.

మళ్లీ ప్రత్యక్షమైన సాలు దొర సెలవు దొర బోర్డు, ఈసారి కల్వకుంట్ల పేరుతో
మళ్లీ ప్రత్యక్షమైన సాలు దొర సెలవు దొర బోర్డు, ఈసారి కల్వకుంట్ల పేరుతో
author img

By

Published : Aug 19, 2022, 5:38 PM IST

bjp digital board on kcr: హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద సాలు దొర.. సెలవు దొర డిజిటల్ బోర్డు మళ్లీ ప్రత్యక్షమైంది. ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సూచిస్తూ.. భాజపా గతంలో కౌంట్​డౌన్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్​ బోర్డుపై రాజకీయ దుమారం రేగింది. జీహెచ్ఎంసీ సైతం బోర్డు ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో భాజపా నేతలు కార్యాలయం వద్ద బోర్డును తొలగించారు.

రెండు నెలల విరామం అనంతరం మళ్లీ సాలు దొర.. సెలవు దొర బోర్డు ఏర్పాటు చేశారు. ఈసారి సీఎం కేసీఆర్ బొమ్మ లేకుండా కల్వకుంట్ల కౌంట్​డౌన్ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. రాజకీయ పదజాలంతోనే తాము బోర్డు ఏర్పాటు చేశామని.. ఎక్కడా పరుష పదజాలం వాడలేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్​రెడ్డి తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంపై కేసీఆర్ బొమ్మను తొలగించాలని కార్యకర్తలు కోరారని.. వారి కోరిక మేరకు కేసీఆర్ బొమ్మ తొలగించి.. మళ్లీ బోర్డును ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.

భాజపా రాష్ట్ర కార్యాలయంపై కేసీఆర్ బొమ్మను తొలగించాలని కార్యకర్తలు కోరారు. కార్యకర్తల కోరిక మేరకు స్వల్ప మార్పులు చేసి బోర్డును మళ్లీ ఏర్పాటు చేశాం. రాజకీయ పదజాలంతోనే బోర్డు ఏర్పాటు చేశాం. ఎక్కడా పరుష పదజాలం వాడలేదు. - ప్రకాశ్​రెడ్డి, భాజపా రాష్ట్ర కార్యదర్శి

మళ్లీ ప్రత్యక్షమైన సాలు దొర సెలవు దొర బోర్డు, ఈసారి కల్వకుంట్ల పేరుతో

ఇవీ చూడండి..

మునుగోడుపై భాజపా ఫోకస్‌, ఎంతలా అంటే

'ఆ బోర్డు తీసేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మోదీ బోర్డులు పెడతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.