ETV Bharat / state

Sailing Week in Hyderabad : హుస్సేన్​సాగర్ అలలపై... 'సెయిలింగ్.. అదిరెన్' - Telangana latest news

Sailing Week in Hussainsagar : ప్రతిష్ఠాత్మకంగా భావించే  హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌.. హుస్సేన్‌సాగర్‌లో అంగరంగవైభవంగా జరిగింది. లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 ఇలా 3 విభాగాలుగా ఈ పోటీలు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 100 మందికి పైగా సెయిలర్లు పోటీల్లో పాల్గొన్నారు. ఇంతకీ హైదరాబాద్‌ సెయిలింగ్ వీక్ పోటీలు ఎలా కొనసాగాయి..? సెయిలర్లు ఏమంటున్నారు..? వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.

Sailing
Sailing
author img

By

Published : Jul 10, 2023, 1:32 PM IST

భాగ్యనగరంలో సెయిలింగ్ జోరు.. ముగిసిన పోటీలు

Sailing Week at Hussainsagar in Hyderabad : ప్రతిష్ఠాత్మకమైన సెయిలింగ్​ వీక్‌ హైదరాబాద్‌లోని హుస్సేన్​సాగర్​లో అంగరంగవైభవంగా జరిగింది. ఈనెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన 37వ సెయిలింగ్ వీక్​లో.. లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 మూడు విభాగాలుగా పోటీలు నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 100 మందికి పైగా సెయిలర్లు పోటీపడ్డారు.

Sailing Week in Hyderabad : సెయిలింగ్​కు జులై- ఆగస్టు నెలల్లో హైదరాబాద్‌లో వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. సెయిలింగ్‌ వీక్‌ కోసం గత పదిహేను రోజుల నుంచి సెయిలర్లకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చారు. ఇందులో భాగంగా సెయిలర్లకు శిక్షణను ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సెయిలింగ్ వీక్​లో పాల్గొనేందుకు సెయిలర్లు వచ్చారు. వారికి ఇక్కడి వాతావరణం అలవాటుపడే విధంగా తర్ఫీదునిచ్చారు.

సుమారు వందమందికి పైగా సెయిలర్లు ఈ ఈవెంట్​లో పాల్గొన్నారు. ఈనెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు హుస్సేన్ సాగర్ వేదికగా 37వ సెయిలింగ్ వీక్ జరిగింది. లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 మూడు విభాగాలుగా జరిగే పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 100 మందికి పైగా సెయిలర్లు పోటీపడ్డారు.

"ఇది లేజర్‌ క్లాస్‌ ఒలింపిక్స్‌ బోటు. సాధారణంగా ఒలింపిక్స్‌లో మగవారికి ఇల్కా 7 బోటు. మహిళలకు ఇల్కా 6 బోటు. చిన్నపిల్లలకు 4.7 బోట్లను ఉపయోగిస్తారు. ఇక్కడ వీటినే ఉపయోగిస్తాం. లేజర్‌ క్లాస్‌లో రెండు రకాల ఈవెంట్స్‌ జరుగుతాయి. అలాగే ఇందులో బాలురు, బాలికలు ఉపయోగించే బోటు ఎత్తుల్లో తేడాలు ఉంటాయి." - రాజేశ్​ సెయిలర్​, అర్జున అవార్డు గ్రహీత

హుస్సేన్ సాగర్​లో వీచే గాలులను, నీటిని సెయిలర్లు తమ ప్రతిభతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతుంటారు. సెయిలర్లు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యుహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. పర్యావరణహితమైన సెయిలింగ్‌ పట్ల నానాటికీ ఆదరణ పెరుగుతోంది. ఇటీవలికాలంలో ఎక్కువ మంది యువతీ, యువకులు సెయిలింగ్ కెరీర్​ను ఎంచుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ.ఎం.ఈ సెయిలింగ్ అసోసియేషన్, లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో... సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌తో కలిసి సెయిలింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇందులో గెలిచిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని శిక్షకులు అంటున్నారు...

"నేను 7 సంవత్సరాల నుంచి సెయిలింగ్‌ చేస్తున్నాను. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. రేసింగ్‌ అనుభూతిని పొందడానికి, జాతీయ స్థాయి శిక్షణ కోసం హైదరాబాద్‌కు వచ్చాను. ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. ఈ నీటిపై సాహసం చేస్తే మంచి అనుభూతి లభిస్తుంది. ఇక్కడ చాలా మంచి అనుభవం ఉన్న సెయిలర్లు ఉన్నారు. రాజేశ్​ చౌదరి, పి. మధు ఇలా చాలా మంది క్రీడాకారులు అంతర్జాతీయ పతకాలు సాధించారు. నేను కూడా అలాగే సాధించాలనుకుంటున్నాను. నా బృందంలో 32 సెయిలర్లు ఉన్నారు. మెుత్తం 80కిపైగా సెయిలర్లు ఈ పోటీలకు వచ్చారు". - అద్వైత్​ సెయిలర్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.