ETV Bharat / state

ఎస్వీబీసీ ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన సాయికృష్ణ యాచేంద్ర

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) ఛైర్మన్​గా సాయికృష్ణ యాచేంద్ర...ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. అలిపిరి ఎస్వీబీసీ కేంద్రీయ కార్యాలయంలో అదనపు ఈవో ధర్మారెడ్డి నుంచి ఆయన ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల పాటు యాచేంద్ర ఈ పదవిలో కొనసాగనున్నారు. ధార్మిక కార్యక్రమాలతో పాటు సంగీత, సాహిత్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్వీబీసీ ఛానల్​ను ప్రజలకు మరింత చేరువ చేస్తామని నూతన ఛైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర తెలిపారు.

saikrishna yachendra as svbc chairman
ఎస్వీబీసీ ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన సాయికృష్ణ యాచేంద్ర
author img

By

Published : Nov 7, 2020, 11:57 PM IST

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ శాసనసభ్యుడు, వైకాపా నేత సాయికృష్ణ యాచేంద్ర శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌గా పదవీబాధ్యతలు చేపట్టారు. తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్న ఎస్వీబీసీ కేంద్రీయ కార్యాలయంలో అదనపు ఈవో ధర్మారెడ్డి నుంచి ఛైర్మన్‌ బాధ్యతలు స్వీకరించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్​కు సాయికృష్ణ యాచేంద్రను ఛైర్మన్​గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రెండు సంవత్సరాల పాటు సాయికృష్ణ ఈ పదవిలో కొనసాగనున్నారు. జనవరి నెలలో సినీ నటుడు పృథ్వీ బాలిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో తొమ్మిది నెలలుగా ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. ఎండీగా బాధ్యతలు చేపట్టిన అదనపు ఈవో ధర్మారెడ్డి ఎస్వీబీసీ కార్యకలాపాలను పర్యవేక్షించారు.

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పృథ్వీ బాలిరెడ్డి... మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా వ్యవహరించినట్లు ఆడియో టేపులు వెలుగు చూడటంతో తన పదవికి రాజీనామా చేశారు. తొమ్మిది నెలల తర్వాత వెంకటగిరి రాజా వారసుడు, మాజీ శాసనసభ్యుడు సాయికృష్ణ యాచేంద్ర కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ధార్మిక కార్యక్రమాలతో పాటు సంగీత, సాహిత్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్వీబీసీ ఛానల్‌ మరింత మందికి చేరువ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.