ETV Bharat / state

గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగురవేయాల్సిందే - 2023 POWER

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలను కమలదళంలో చేర్చుకుంటోంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలనాథుల పావులు
author img

By

Published : Jul 1, 2019, 9:58 AM IST

దక్షిణాదిన పాగావేయాలని భావిస్తోన్న భాజపా.. తెలంగాణను లక్ష్యంగా చేసుకుంది. 2018 ముందస్తు ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ ఫలితాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇది కమలనాథులను తీవ్ర నిరాశకు గురిచేసినప్పటికీ... 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. 20 శాతం ఓటు బ్యాంకునూ.. కైవసం చేసుకుంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందనే విశ్వాసం జాతీయ నాయకత్వానికి వచ్చింది. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని ఆ పార్టీ నాయకుల వాదనలకు బలం చేకూరింది.

రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుంది : జాతీయ నాయకత్వం
'రాంమాధవ్​దే బాధ్యత' రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన కమల దళం రాష్ట్ర నేతలను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఫిరాయింపులకు వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు అప్పగించింది. త్వరలోనే కాంగ్రెస్‌, తెరాస ముఖ్య నేతలు భాజపాలో చేరతారని విశ్వసనీయ సమాచారం. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పైన రాంమాధవ్‌ ప్రత్యేక దృష్టి సారించారు. నాయకులకు రాజకీయ భరోసా కల్పించేందుకు ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలతో పరిచయం చేస్తున్నారు. '2023లో కాషాయజెండా ఎగురవేసే వరకు చేరికలు' ఈ నెలలో దిల్లీ వేదికగా వివధ పలువురు కీలక నేతలు భాజపాలో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2023లో గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగరవేసే వరకు చేరికలు ఉంటాయని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు సముచిత స్థానం కల్పిస్తూనే.. కష్ట కాలంలోనూ పార్టీని నమ్ముకున్న నేతల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా సమన్వయం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. 'పార్టీ బలోపేతానికి కొత్తగా 12 లక్షల సభ్యత్వాలు' రాష్ట్రంలో భాజపాకు ఇప్పుడున్న సభ్యత్వం కాకుండా కొత్తగా 12 లక్షల మందిని చేర్పించాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను చేర్చుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేసింది. కమలనాథుల వ్యూహాలు ఫలించి 2020 చివరినాటికి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగితే.. 2023లో గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగరడం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇవీ చూడండి : కొత్త సారసాల ఘటనను ఖండించిన సీపీఐ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.