Rythu Badi Youtube Channel 1 Million Mega Event at Ravindra Bharathi : భవిష్యత్‌లో ప్రపంచ ఆహార అవసరాలు తీర్చే శక్తి భారతదేశానికి మాత్రమే ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Agriculture Minister Singireddy Niranjan Reddy) అన్నారు. వ్యవసాయం ఆధునిక పరిశ్రమగా ఎదిగేందుకు వ్యవసాయ అనుకూల విధానాలు రావాలన్నారు. డాలర్లు, రూపాయలు ఆహారం అందించలేవని పేర్కొన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన తెలుగు రైతు బడి యూట్యూబ్ ఛానల్ 1 మిలియన్ స్టోన్ మెగా ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు సమాచార శాఖ మాజీ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్ రాజా వరప్రసాద్ రావు, రైతుబడి యూట్యూబ్ ఛానల్ అధినేత రాజేందర్ రెడ్డి(Rythubadi YouTube Channel Head Rajender Reddy) తదితరులు పాల్గొన్నారు.
Seed fair_ 2023 : 'వ్యవసాయ పంటలకు విలువ జోడిస్తేనే అన్నదాతలకు ప్రయోజనం'
సృష్టిలో మారనిది వ్యవసాయం ఒక్కటే: ఈ సందర్భంగా భావి ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమే అని మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాలక్రమంలో అనేక వృత్తులు మారుతున్నా.. సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయమని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతికత ఎంత పెరిగినా ఆహారం వ్యవసాయం ద్వారానే వస్తుందని మంత్రి అన్నారు. దీనికి ప్రత్యామ్నాయం ఏదీ లేదన్నారు. కాలక్రమంలో వ్యవసాయరంగంలో రసాయనిక ఎరువులు పెరిగి అనర్థాలకు దారి తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సహజ ఎరువుల వినియోగం పెంచి.. మనం తినే ఆహారంలో సమతుల్యత పాటిస్తే.. సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమేనని తెలిపారు.
Rythubadi Telugu YouTube Channel : రైతు తల ఎత్తుకునే పరిస్థితి లేని దుస్థితి నుంచి నేడు తెలంగాణలో నేను రైతును అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారని స్పష్టం చేశారు. పని చేయని వారికి, కష్టపడని వారికి ఈ భూమి మీద తినే హక్కు లేదన్నారు. రైతు బంధు పథకం(Rythu Bandhu Scheme) గురించి కొందరు వ్యక్తులు, ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశాన్ని దోచుకుని విదేశాలకు పోయిన దొంగల గురించి వారు చర్చించరని.. వార్తలు రాయరని దుయ్యబట్టారు. రైతుకు చేసిన సాయం మీద వక్రభాష్యాలు చెబుతున్నారని ఆక్షేపించారు. ఇలాంటి ధోరణి మారాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా ముందుకు సాగాలి. మిలియన్ కాదు మిలియన్స్ ఆఫ్ వ్యూయర్ షిప్ దాకా మనం పోవాలి. ఇందుకు తప్పకుండా మా అందరి సహకారం ఉంటుంది. ఆధునికత, శాస్త్ర సాంకేతిక పెరిగే కొద్దీ సమాజంలో కొన్ని వృత్తులు రూపాంతరం చెందుతాయి. అలాగే కొన్ని వృత్తులు కాల గమనంలో అంతరించిపోతాయి. మనం ఒకసారి చూసినటు వంటివి మళ్లీ కనిపించట్లేదు. -సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
Niranjan Reddy Farm Progress Show 2023 : 'ఫార్మ్ ప్రోగ్రెస్ షో'కు మంత్రి నిరంజన్ రెడ్డికి ఆహ్వానం
Niranjan Reddy Review on Monsoon Crops : 'స్వల్పకాలిక పంటల సాగుపై రైతులను చైతన్యం చేయండి'