ఇవీ చదవండి: 'నీటి విడుదల'
నెక్లెస్‌రోడ్‌లో 'బ్లూ మైల్'
వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్లూ మైల్ పేరుతో 10కె, 5కె పరుగు నిర్వహించారు. భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి ఒక్కరు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పిలుపునిచ్చారు.
పరుగును ప్రారంభించిన దానకిషోర్
హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో నీటి సంరక్షణ, వినియోగంపై అవగాహన కల్పిస్తూ వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ 10కె, 5కె పరుగును నిర్వహించింది. బ్లూ మైల్ పేరుతో నిర్వహించిన ఈ పరుగును జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ప్రారంభించారు. సహజ వనరులను కాపాడటంలో ప్రజలు తమ పాత్ర పోషించడంలేదని దానకిషోర్ అన్నారు. ఇప్పటికైనా ముందు చూపుతో వ్యవహరించి ప్రతి ఒక్కరు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాశ్, సినీ నటుడు అడవి శేషుతో పాటు యువత పాల్గొని ఉత్సాహంగా పరుగెత్తారు.
ఇవీ చదవండి: 'నీటి విడుదల'
Note: Script Etv Office