ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్లోని తమ కార్యాలయం వద్ద సామూహిక నిరాహార దీక్షను చేపట్టారు. వేతన సవరణ జరగాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ.ఎం.యూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. 55 రోజుల సమ్మె కాలపు జీతాన్ని అందజేయాలని కోరారు.
2018 ఏప్రిల్ తర్వాత పదవీ విరమణ పొందిన కార్మికులకు మూడేళ్లు గడిచినా... పూర్తిస్థాయి సెటిల్మెంట్ ఇవ్వడంలేదన్నారు. దీంతో వారికి ఒక పక్క జీతం లేక... మరోపక్క పెన్షన్ రాక... ఇళ్లు గడవని పరిస్థితి ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: భారీగా నల్లబెల్లం పట్టివేత.. ముగ్గురి అరెస్ట్