ETV Bharat / state

'సమ్మెకు ముగింపు పలికాం.. విధుల్లో చేర్చుకోండి'

author img

By

Published : Nov 26, 2019, 5:54 AM IST

Updated : Nov 26, 2019, 7:21 AM IST

ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు చేసిన సుదీర్ఘ సమ్మెకు సోమవారంతో ముగింపు పలికారు. ఈరోజు నుంచి సమ్మె విరమించి విధుల్లోకి వెళుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. ఇవాళ విధుల్లోకి చేరేందుకు వచ్చే కార్మికులను ప్రభుత్వం చేర్చుకోవాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.

ముగింపు
ముగింపు

దాదాపు రెండు నెలలు సాగిన ఆర్టీసీ సమ్మెకు కార్మికులు ముంగిపు పలికారు. అనేక పోరాటాలు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నామని సమ్మెపై జేఏసీ నేతలు భావోద్వేగానికి గురయ్యారు. సమ్మె కాలంలో కార్మికులు మొక్కవోని ధైర్యంతో ఉన్నారని కొనియాడారు. ట్యాంక్ బండ్ దీక్ష, సరూర్​నగర్ సభ, డిపోల ముందు ఆర్టీసీ కుటుంబసభ్యులతో దీక్షలు, మానవహారాలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి, ఇందిరాపార్కు వద్ద దీక్ష, చివరకు ఆర్టీసీ జేఏసీ నేతల నిరవధిక దీక్షలు చేశామని నేతలు గుర్తుచేసుకున్నారు.

నేటి నుంచి విధుల్లోకి..

తమ ప్రధాన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కూడా వదులుకున్నామని పేర్కొన్నారు. చివరగా ఎలాంటి షరతులు లేకుండా చేర్చుకుంటే... విధుల్లో చేరేందుకు సిద్ధమని కూడా స్పష్టం చేశామని తెలిపారు. వివిధ కారణాలతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఇన్ని చేసినా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అంశాన్ని హైకోర్టు లేబర్ కోర్ట్​కు బదిలీ చేయగా.. తాము సమ్మె విరమించామని ఆర్టీసీ నేతలు వెల్లడించారు. నేటి నుంచి విధుల్లో చేరతామని స్పష్టం చేశారు.

ఆటంకం కలిగించవద్దు..

కార్మికులను విధుల్లో చేర్చుకునే పరిస్థితి లేదని ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. తాత్కాలిక కార్మికుల విధులకు ఆటంకం కలిగించవద్దని ఆయన పేర్కొన్నారు. లేబర్ కమిషనర్ నిర్ణయం వచ్చే వరకు సంయమనం పాటించాలన్నారు.

విధుల్లో చేర్చుకోం

ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ

Last Updated : Nov 26, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.