ETV Bharat / state

TSRTC: హైదరాబాద్‌-విజయవాడ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ - tsrtc offer on bus tickets

TSRTC 10 percent Discount in Hyderabad-Vijayawada Route : ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌-విజయవాడ ప్రయాణికులకు టికెట్​పై 10 శాతం రాయితీ ప్రకటించింది. ఈ నెల 30 వరకు ఈ డిస్కౌంట్‌ అమల్లో ఉంటుందని తెలిపింది.

TSRTC
TSRTC
author img

By

Published : Apr 13, 2023, 6:39 PM IST

TSRTC 10 percent Discount in Hyderabad-Vijayawada Route : ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎస్​ఆర్టీసీ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ఆ మార్గంలో నడిచే సూపర్‌ లగ్జరీ, రాజధాని ఏసీ బస్సు సర్వీసుల్లో రానుపోనూ ప్రయాణికులకు రాయితీ ఇవ్వనుంది. ఈ నెల చివరి వరకు రాయితీ అమల్లో ఉంటుందని టీఎస్ ఆర్టీసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. విశాఖ వెళ్లే వారికి కూడా రాయితీ ఉండనుంది. విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్‌ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించిందని ప్రకటనలో వివరించారు.

విశాఖపట్నం వెళ్లేవారికి కూడా రాయితీ : ఒకరు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం ప్రయాణించాలనుకుంటే.. వారి టికెట్‌లో విజయవాడ వరకు 10 శాతం రాయితీ కల్పించడం జరుగుతుందని ప్రకటనలో తెలిపారు. ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.40 నుంచి రూ.50 వరకు ఆదా అవుతుందని సంస్థ అధికారులు తెలిపారు. ఈ నెల 30 వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రతి ప్రయాణికుడు వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు.

రిజర్వేషన్‌ చేసుకోవాలంటే తమ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtconline.comను సంప్రదించాలని సూచించారు. ముందుగా రిజర్వేషన్‌ చేసుకునే వారికి టీఎస్‌ఆర్టీసీ రాయితీ కల్పిస్తోందని గుర్తు చేశారు. 31 రోజుల నుంచి 44 రోజుల మధ్యలో అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకునే వారికి 5 శాతం, 45 నుంచి 60 రోజుల మధ్యలో టికెట్ రిజర్వేషన్‌ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్‌ 040-69440000, 23450033 నంబర్లను సంప్రదించాలన్నారు. పిల్లలకు వేసవి సెలవుల దృష్ట్యా సొంతూళ్లకు వెళ్లే వారికి ఇది ఓ మంచి ఆఫర్.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.