ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోంది'

author img

By

Published : Mar 30, 2021, 5:20 PM IST

ఆర్టీసీ కార్మికుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆరోపించారు. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. కమిషన్ జోక్యం చేసుకొని కార్మికుల హక్కులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

rtc union complaint on state government, rtc union met hrc
రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం, హెచ్​ఆర్సీని ఆశ్రయించిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్

ఆర్టీసీ కార్మికుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆరోపించారు. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. 2019లో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై 55 రోజుల సమ్మె చేపట్టిన నేపథ్యంలో... ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండకూడదనే ఉద్దేశంతో యూనియన్లను మౌఖికంగా రద్దు చేస్తున్నట్లు ఆదేశించారని కమిషన్​కు యూనియన్ నాయకుడు రాజిరెడ్డి వివరించారు.

కమిటీలు విఫలం

యూనియన్ల స్థానంలో వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేశారని... అవి యాజమాన్యానికి కార్మికుల మధ్య వారధిగా పనిచేస్తాయని ప్రభుత్వం తమని మభ్యపెట్టిందని ఆరోపించారు. ఆ కమిటీలు చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను యాజమాన్యానికి తెలపడంలో విఫలం అవుతున్నాయని పేర్కొన్నారు.

పట్టించుకోలేదు

యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వైఖరిపై లేబర్ కమిషనర్​కు, రవాణా, కార్మిక శాఖ మంత్రులకు, చీఫ్ సెక్రటరీకి ఎన్నో సార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ విషయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు. కార్మికుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: '2025 నాటికి డిజిటల్‌ ఉద్యోగాలు తొమ్మిది రెట్లు పెరగాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.