హైదరాబాద్‌లోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ చట్టాలను అమలు చేయాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం డ్యూటీల విధానం ఉండాలని కమిషనర్‌ను కోరారు. ఇప్పటిదాకా వేతన సవరణ చేయకపోవడాన్ని కార్మిక నేతలు తప్పుబట్టారు. ఎన్నికలు నిర్వహించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి హెచ్చరించారు.