Tsrtc prc: దీపావళి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు తీపికబురు అందించింది. పీఆర్సీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సంస్థ ఉద్యోగులకు బస్‌భవన్ సాక్షిగా వంద కోట్ల పెండింగ్ బకాయిలు.. దీపావళి పండగ అడ్వాన్సులు ప్రకటించినట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని విధాలుగా సీఎం సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు.
అందులో భాగంగా ఉద్యోగుల పీఆర్సీపై కూడా చర్చించడం జరిగిదని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు . 2017 నుంచి పీఆర్సీ పెండింగ్‌లో ఉందని దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జానార్ ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి.. ఎన్నికల ప్రధాన అధికారికి లేఖలు పంపారని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల నియమావళి అమలులో ఉన్నా ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఆ ప్రక్రియ ప్రారంభించడానికి.. ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరినట్లు వివరించారు. ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయం తర్వాత.. ఉద్యోగులకు సీఎం ఆదేశాల మేరకు పీఆర్సీ అమలు చేస్తామని గోవర్ధన్ తెలిపారు. సంస్థ ఉద్యోగులను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టంచేశారు.
ఇవీ చదవండి:
హైదరాబాద్ నగర నడిబొడ్డు నుంచే భారత్ జోడో యాత్ర.. రూట్ మ్యాప్ ఇదే..
మునుగోడులో మూడు పార్టీల ముమ్మర ప్రచారం.. రంగంలోకి సీనియర్లు
రెండేళ్ల చిన్నారి గొప్ప మనసు.. క్యాన్సర్ రోగుల కోసం జుట్టు దానం..