TSRTC: ‘క్షేత్రస్థాయిలో సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఇక నుంచి ఆలస్యంగా కార్యాలయాలకు రావటాన్ని అనుమతించబోం. ఉదయం 10.45గంటలు దాటితే కార్యాలయానికి రావాల్సిన పనిలేదు. నిర్ధారిత సమయంలో ఆఫీసుకు రానివారి వివరాలను హాజరు రిజిస్టర్‌లో గైర్హాజరుగా నమోదు చేయాలి’ అని టీఎస్‌ఆర్టీసీ ఉత్తర్వులు జారీచేసింది. విజిలెన్స్ అధికారులు ఇటీవల డిపోల్లోని పరిపాలనా కార్యాలయాలు, డిస్పెన్సరీల తనిఖీ సందర్భంగా సిబ్బంది సమయానికి కార్యాలయాలకు రావటం లేదని గుర్తించారు.
ఈ నేపథ్యంలో సమయపాలనపై స్పష్టంగా మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు ఉదయం పదిన్నరలోపు విధిగా కార్యాలయాలకు రావాలని, 10.45గంటలకు రిజిస్టర్‌ను క్లోజ్ చేయాలన్నారు. 6నెలల వ్యవధిలో ఆరుదఫాలు ఆలస్యంగా వచ్చిన వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామన్నారు. ఇకనుంచి ఉద్యోగులు హాజరురిజిస్టర్‌లో ఉదయ 10.30గంటలకు ఒకసారి, సాయంత్రం 4.30 గంటలకు రెండోసారి సంతకంపెట్టాలన్నారు.
ఇదీ చదవండి: గుడ్న్యూస్.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి