ETV Bharat / state

RTC problems: తిండి దొరకదు.. నిద్ర పోలేరు.. బస్టాండ్లలో డ్రైవర్లు, కండక్టర్ల కష్టాలు

ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అనేక తిప్పలు పడుతున్నారు. బస్టాండ్లలో సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారు. తగినన్ని విశ్రాంతి గదులు లేక రాత్రిళ్లు బస్సులపైనే నిద్రిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కొన్నిసార్లు భోజనం దొరకక కాలే కడుపులతో నిద్రపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోతున్నారు.

author img

By

Published : Jun 4, 2021, 9:18 AM IST

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు తప్పని తిప్పలు

ఆర్టీసీ ప్రయాణం అంటే ప్రజలకు భరోసా. గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చుతుందని నమ్ముతారు. ఆ నమ్మకానికి ప్రధాన కారణం.. డ్రైవర్లు తగినంత విశ్రాంతి తీసుకుని బస్సులను నడపడం వల్లే అది సాధ్యమవుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ విరామ సమయంలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లకు తగినంత విశ్రాంతి లభించడం లేదు. బస్టాండ్లలో విశ్రాంతి గదులు ఉన్నా.. అందులో రాత్రి ఉండాల్సిన వారికంటే ఎక్కువ మంది పడుకోవాల్సి వస్తోంది. కరోనా వేళ భౌతిక దూరం సాధ్యపడటం లేదన్న ఉద్దేశంతో బస్సుల టాపులపై నిద్రపోతున్నారు. కానీ దోమలు విపరీతంగా ఉండటం వల్ల నిద్రపట్టడం లేదు. చాలామంది బస్సులపై దోమతెరలు కట్టుకున్నా.. ప్రశాంతంగా నిద్రపోలేక పోతున్నామని వాపోతున్నారు.

కరోనా వేళ కష్టపడుతున్న తమకు సరైన వసతులు లేకపోవడం వల్ల అనేక అవస్థలు పడాల్సి వస్తోందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్​తో పాటు.. లాక్‌డౌన్ విరామ సమయం ముగిసే వరకు ఆయా గమ్యస్థానాలకు చేరుకునే డ్రైవర్లు, కండక్టర్లంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశ్రాంతి గదుల వద్ద మంచి నీటి వసతులు లేక.. మరోవైపు ఎండాకాలం కావడం వల్ల తాము తెచ్చుకున్న భోజనం చెడిపోయి.. ఆకలితో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. బయట ఎక్కడైనా తిందామనుకున్నా అన్నీ మూసే ఉంటున్నాయని వాపోయారు. కొన్నిసార్లు కాలే కడుపుతోనే పడుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లారే వరకు ఆకలితోనే ఉండి.. ఉదయం కాస్త తిని తిరిగి సొంత డిపోకు చేరాల్సి వస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Covid : జలమండలిపై రెండో దశ కొవిడ్ పంజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.