ETV Bharat / state

2 Hours TSRTC Bandh in Telangana State Wide : రాష్ట్రవ్యాప్తంగా 2 గంటలు బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్టీసీ

TSRTC Bandh Timings
TSRTC Bandh Tomorrow in Telangana
author img

By

Published : Aug 4, 2023, 10:35 PM IST

Updated : Aug 4, 2023, 10:58 PM IST

22:32 August 04

శనివారం రాష్ట్రవ్యాప్తంగా 2 గంటలు బంద్​

2 Hours TSRTC Bandh in Telangana State Wide : రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల తీసుకువచ్చిన టీఎస్​ఆర్టీసీ బిల్లును రాజ్​భవన్​ పెండింగ్​లో ఉంచినందున.. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 2 గంటలు బంద్​ చేసేందుకు ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆర్టీసీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి. గవర్నర్​ బిల్లును ఆమోదించాలని ఆర్టీసీ టీఎంయూ నిరసన చేపట్టనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కార్మికులు నెక్లెస్ రోడ్డుకు రావాలని యూనియన్​ ప్రకటించింది. ఆగస్టు 5న ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ వద్ద ఆర్టీసీ కార్మికులు తమ నిరసన తెలియజేయనున్నారు. ఈ బిల్లుకు ఇంకా గవర్నర్​ వివరణ ఇవ్వలేనందున.. పరిశీలనకు మరికొంత సమయం అవసరమని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.

TSRTC Latest News : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల తీసుకొచ్చిన ఆర్టీసీ బిల్లును రాజ్‌భవన్‌ పెండింగ్‌లోనే ఉంచింది. బిల్లు పరిశీలనకు మరికొంత సమయం అవసరమని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ బిల్లుపై న్యాయసలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్‌భవన్‌ పేర్కొంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వని పక్షంలో రాజ్ భవన్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు గవర్నర్ ప్రెస్ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలు మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండో తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాజ్ భవన్‌కు బిల్లు చేరిందని పేర్కొన్నారు. ఆర్టీసీ బిల్లును పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని, న్యాయసలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్ భవన్ స్పష్టం చేసింది.

Governor Tamilisai on TSRTC Bill : ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన బిల్లు ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్‌ వద్దకు పంపించారు. రాష్ట్ర కేబినేట్‌ రూపొందించిన బిల్లును యుద్ధ ప్రాతిపదికన రెండు రోజుల క్రితమే ప్రభుత్వం రాజ్​భవన్​కు పంపింది. అయితే ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ ఆమోదం లభించలేదు. ఒక వేళ తమిళిసై అనుమతి లభిస్తే ఇతర బిల్లులతో పాటు ఈ బిల్లు కూడా ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ముందుగా భావించింది. గవర్నర్ నుంచి ఎటువంటి అనుమతి రాకపోవడంతో ఎజెండాలో పొందుపరచలేదు.

ఆర్టీసీ చరిత్ర తెలుసా..: మన దేశంలోనే మొదటిసారిగా 1932లో నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. 166 మంది కార్మికులు, 27 బస్సులతో ప్రారంభమైన సంస్థను నవంబర్‌ 1, 1951లో హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనం చేశారు. తెలగు రాష్ట్రాల విభజన రాష్ట్ర విభజన అనంతరం.. 1950 రోడ్డు రవాణా సంస్థ చట్టం ప్రకారం... 2016 మార్చి 27న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా మార్చారు. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల 373 మంది కార్మికులు ఉన్నారు.

Tamilisai Did Not Approve TSRTC Bill : ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపని గవర్నర్‌ తమిళిసై

Interview With TSRTC Chairman : టీఎస్​ఆర్టీసీ ఉద్యోగికి ఎంత వేతనం పెరగనుంది?.. ఎప్పటి నుంచి?

Last Updated : Aug 4, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.