సేవాదృక్పథంతోనే ఉద్యోగం చేస్తున్న తనపై కొందరు చేసిన ఆరోపణలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయని రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. మంగళవారం జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీశైలం...తనపై నిందారోపణలు చేశారని..ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రగురుకులాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వచ్చిన అవార్డులే తన సేవకు నిదర్శనమని అన్నారు. పదవీకాలంలో తొమ్మిది రాష్ట్రాల ప్రతినిధులతోపాటు 15వ ఆర్థికసంఘం, జాతీయ ఎస్సీ కమిషన్ సహా అంతర్జాతీయ ప్రతినిధులు గురుకులాలను సందర్శించి అభివృద్ది నమూనాను ఆయా రాష్ట్రాలు, దేశాల్లో అమలు కోసం కృషిచేస్తున్నారని వివరించారు. రాష్ట్ర విద్యావ్యవస్థలో మార్పు వస్తున్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలను విమర్శించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. భావ ప్రకటనా హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని.. ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు.
ఇదీ చూడండి: ఖమ్మం పోరులో విజేత ఎవరు?