ETV Bharat / state

మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్​ 'మేరీ సహేలీ' - rpf latest news hyderabad

రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికుల భద్రత, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఆర్పీఎఫ్​ ఆధ్వర్యంలో మేరీ సహేలీ పేరుతో సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో మహిళలకు భద్రతా సిబ్బంది అవగాహన కల్పించారు.

rpf awareness program for railway women passengers in secunderabad
మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్​ 'మేరీ సహేలీ'
author img

By

Published : Oct 26, 2020, 3:59 PM IST

రైలు ప్రయాణంలో మహిళలకు ఎలాంటి ఆపద రాకుండా రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. "మేరీ సహేలీ" పేరుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైళ్లలో మహిళల భద్రత, ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే ఐజీ ఈశ్వర్‌రావు ఆధ్వర్యంలో వారికి భద్రతా సిబ్బంది అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లోని మహిళా ప్రయాణికులతో ఐజీ మాట్లాడి సందేహాలు నివృత్తి చేశారు. ప్రయాణంలో ఆపద వస్తే 182 నంబరుకు కాల్​ చేయాలని సూచించారు.

ఇదీ చదవండి: ఇంటి నుంచే పనా? ఈ యాప్‌లు మీ పని సులువవుతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.