ETV Bharat / state

ఇల్లు అద్దెకు కావాలని చెప్పి దొంగతనం - ఇల్లు అద్దెకు కావాలని చెప్పి చోరీ

హైదరాబాద్ మేడిపల్లి పీఎస్​ పరిధిలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. అద్దెకు ఇల్లు కావాలని వచ్చిన దుండగులు.. గదులు చూపిస్తుండగా మహిళపై మత్తు మందు చల్లి.. మెడలోంచి మంగళసూత్రం, చెవికమ్మలు తీసుకుని పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇల్లు అద్దెకు కావాలని చెప్పి దొంగతనం
ఇల్లు అద్దెకు కావాలని చెప్పి దొంగతనం
author img

By

Published : Sep 3, 2020, 5:13 PM IST

హైదరాబాద్ మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పట్టపగలు దొంగలు హల్ చల్ చేశారు. ఐఐసీటీ కాలనీ అధ్యక్షుడు బీపీ చారి తన ఇంటి ముందు గేటుకు ఇల్లు అద్దెకు ఇవ్వబడును అని బోర్డు ఏర్పాటు చేశాడు. చారి భార్య శారదా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు. అద్దెకు‌ ఇచ్చే ఇల్లు చూపించాలని‌ అడిగారు. లోపలికి తీసుకెళ్లి‌ చూపిస్తుండగా.. మహిళపై మత్తు మందు చల్లారు. మహిళ మెడలోని సుమారు మూడు తులాలు విలువ గల మంగళ సూత్రం, చెవి కమ్మలు తీసుకుని పరారీ అయ్యారు.

కొద్ది సేపటి తర్వాత ఇంటికి వచ్చిన భర్త అక్కడి పరిస్థితి చూసి స్థానికుల సహాయంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి శారదను తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శారదా నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి‌ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.