ETV Bharat / state

రాష్ట్రంలో భారీ వర్షాలకు అధ్వానంగా మారిన రోడ్లు - భారీ వర్షాలకు అధ్వానంగా మారిన రోడ్లు

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి రహదారులు అధ్వానంగా మారిపోయాయి. వేలకొద్ది కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. రాష్ట్ర రహదారులు, హైవేలు అనే తేడా లేకుండా... కోతకు గురయ్యాయని... రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదిక సమర్పించింది. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు సుమారు 223 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు... సాయం కోసం కేంద్రానికి నివేదించారు.

roads damage with rains in telannagana
రాష్ట్రంలో భారీ వర్షాలకు అధ్వానంగా మారిన రోడ్లు
author img

By

Published : Oct 28, 2020, 5:22 AM IST

Updated : Oct 28, 2020, 5:52 AM IST

రాష్ట్రంలో భారీ వర్షాలకు అధ్వానంగా మారిన రోడ్లు

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. కుంభవృష్టికి ధ్వంసమైన రోడ్లను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్లకు మరమ్మతుల కోసం అవసరమైన నిధులపై అంచనాలు రూపొందించి... ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి నివేదిక రూపంలో అందజేశారు. రాష్ట్ర రహదారులు 4 వేల 829 కిలోమీటర్ల మేర దెబ్బతినడం వల్ల 145 కోట్ల 36 లక్షల నష్టం వాటిల్లినట్లు రోడ్డు, భవనాల శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. భారీ వర్షాల వల్ల 4 వేల 460 కిలోమీటర్ల మేర రోడ్లు కోతలకు గురయ్యాయని... వీటివల్ల 7 కోట్ల 85 లక్షలు నష్టం వచ్చిందని తెలిపారు. వీటితో పాటు వరదల వల్ల సుమారు 4 వేల 90 కిలోమీటర్ల వరకు రహదారులపై గుంతలు పడి... 4 కోట్ల 57 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి సమర్పించిన నివేదికలో వివరించారు.

అత్యధికంగా నల్గొండ జిల్లాలో...

అటు నిర్మాణంలో ఉన్న కల్వర్టులు దెబ్బతిని 52 కోట్ల 97 లక్షల మేర నష్టం వచ్చినట్లు తేల్చారు. భారీ వర్షాల వల్ల రాష్ట్ర రహదారులకు 210 కోట్ల 77 లక్షల నష్టం జరిగిందని రోడ్లు, భవనాల శాఖ ఓ అంచనాకు వచ్చింది. రాష్ట్రానికి కలిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర బృందానికి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు-వరదల వల్ల అత్యధికంగా నల్గొండ జిల్లాలో 500 కిలోమీటర్ల వరకు రోడ్లు దెబ్బతినగా... 19 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 96 కిలోమీటర్ల మేర రహదారులు అస్తవ్యస్తంగా తయారవడం వల్ల 3 కోట్ల 8 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అభిప్రాయపడ్డారు.

కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్లు

కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ -సుందరగిరి -సైదాపూర్ మార్గంలో 5.9 కిలోమీటర్లు... నల్గొండ జిల్లాలో హాల్య-ఆంజనేయ తండారోడ్డులో 5.5కిలోమీటర్లు మేర రోడ్డు దెబ్బతింది. ఘట్‌కేసర్ - అనాజ్‌పుర్ రోడ్డు 3.5 కిలోమీటర్లు, నల్గొండ జిల్లా తుమ్మాడం - వడ్డారగూడ మార్గంలో 2.5 కిలోమీటర్లు మేర కోసుకుపోయింది. మహబూబ్‌నగర్ - చించోలీ మార్గంలో 400 మీటర్ల రోడ్లు దెబ్బతిందని ఆర్​ అండ్​ బీ అధికారులు పేర్కొన్నారు.

ధ్వంసమైన జాతీయరహదారులు

భారీ వర్షానికి జాతీయ రహదారులు 9 కిలోమీటర్ల పరిధిలో ధ్వంసమయ్యాయి. వీటివల్ల 8 కోట్ల 15 లక్షల మేర నష్టం ఏర్పడింది. వరదల వల్ల సుమారు 200 మీటర్ల వరకు రోడ్లు దెబ్బతిని... కోటి 48 లక్షల మేర నష్టం వాటిల్లింది. కల్వర్టుల పనులకు సంబంధించి.. మరో 2 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు నిర్ణయానికి వచ్చారు. జీహెచ్​ఎంసీ పరిధిలోని ఆరు ప్రాంతాల్లో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ - బెంగళూరు మార్గంలోని గగన్‌పహాడ్ వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి తీవ్రంగా కోసుకుపోవడం వల్ల రెండ్రోజులు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కొత్తగూడ వద్ద మరమ్మతులో ఉన్న వంతెన కూడా పలుచోట్ల దెబ్బతింది. ఇక్కడ తాత్కాలికంగా వాహనాలు వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ - వరంగల్ హైవేపై మూడు ప్రాంతాల్లో రోడ్డు కొట్టుకుపోయింది. నల్లచెరువు వద్ద కిలోమీటరుకు పైగా రోడ్డు కోసుకుపోగా... ఇప్పటికీ నిర్మాణ పనులు చేపట్టకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారి కాటేదాన్, గగన్‌పహాడ్ దగ్గర నీరు పొంగిపొర్లడం వల్ల 150 మీటర్ల వరకు తెగిపోయిందని అధికారులు వివరించారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో 18వేల మంది పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపం

Last Updated : Oct 28, 2020, 5:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.