Different road accidents in the state: రాష్ట్రంలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోగా ఇద్దరికి గాయాలయ్యాయి. ములుగు జిల్లాలో ఒక బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బైక్‌ను ఆర్టీసి బస్సుకు ఢీ కొట్టడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్‌పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణం అవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు నిత్యం జాగ్రత్తగా ఉండాలి అని ప్రమాదపు దృశ్యాలను ట్విటర్లో పోస్ట్ చేశారు. ట్రాఫిక్ రూల్స్‌ను విధిగా పాటించాలని అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు.
-
ఈ బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బైక్ ను #TSRTC బస్సుకు ఢీకొట్టాడు. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం… pic.twitter.com/5zv1y04a6X
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఈ బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బైక్ ను #TSRTC బస్సుకు ఢీకొట్టాడు. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం… pic.twitter.com/5zv1y04a6X
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 17, 2023ఈ బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బైక్ ను #TSRTC బస్సుకు ఢీకొట్టాడు. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం… pic.twitter.com/5zv1y04a6X
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 17, 2023
Khammam accident to day: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేంద్రానికి దగ్గరలో సూర్యాపేట టు ఖమ్మం హైవే రోడ్‌పై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఖమ్మం నుండి సూర్యాపేట వైపు వెళ్తున్న ఎనామిల్ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్‌ను గుద్దటంతో పల్టీలు కొట్టింది. ఆయిల్ ట్యాంకర్లో ప్రయాణిస్తున్న డ్రైవర్, క్లీనర్లకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని హైవే రహదారికి అడ్డులేకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Road accident in Karimnagar : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్టీరింగ్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు కరీంనగర్ జిల్లా కనుకులగిద్ద గ్రామ సర్పంచి గోపు కొమురారెడ్డిగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపునకు వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. కారు బెలూన్లు తెరుచుకున్నాయని వివరించారు. గోపు కొమురారెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ముఖ్య అనుచరుడు. సమాచారం అందుకున్న బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకొన్నారు. మృతుడు గతంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కొమురారెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.
ఇవీ చదవండి.
Telangana Road Accidents Today : రక్తమోడిన రహదారులు.. రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృతి