ETV Bharat / state

నగరంలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. సర్వేలో వెల్లడి! - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పలు శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రమాదాల నివారణకు ప్రణాళిక రచిస్తున్నారు. నగరాన్ని ప్రమాదరహిత హైదరాబాద్​గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 23 శాతం ప్రమాదాలు తగినట్లు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది.

Road accidents Decreased in Hyderabd
నగరంలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. ట్రాఫిక్​ పోలీసుల సర్వేలో వెల్లడి!
author img

By

Published : Jul 18, 2020, 10:20 PM IST

హైదరాబాద్ మహానగరంలో దాదాపు కోటి జనాభా, 40 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. నిత్యం రోడ్లపై 15లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో నిత్యం పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో కొంతమంది గాయాలతో బయటపడగా.. మరికొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్‌ను ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా జీహెచ్​ఎంసీ, రహదారులు భవనాల శాఖ, మెట్రోరైలు అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రమాదాల నివారణకు పలు నివేదికలు తయారుచేసి వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది జరిగిన ప్రమాదాల ఆధారంగా 60 బ్లాక్​స్పాట్​లను గుర్తించి వాటి వద్ద తగిన చర్యలు చేపట్టారు. దీని వల్ల గతేడాది మొదటి ఆరు నెలల తో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ప్రమాదాలు 23 శాతం తగ్గినట్లు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది.

అవగాహన పెంచిన పోలీసులు...
ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్ధేశంతో పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో 578 విద్యాసంస్థల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రెండున్నర లక్షల మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం లాక్​డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడడం వల్ల సామాజిక మాధ్యమాల ద్వారా రోడ్డు ప్రమాదాల గురించి విద్యార్థులను చైతన్య పరుస్తున్నారు. ఈ ఏడాది వాహనదారులు, పాదచారుల భద్రతే లక్ష్యంగా రహదారి భద్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న పలు అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, ఫోన్​లో మాట్లాడుతూ డ్రైవింగ్, శిరస్త్రాణం లేని ద్విచక్ర వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు.

చలాన్ల మోతతో.. అదుపు..
గతేడాదితో పోలిస్తే ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికంగా చలాన్లు విధించారు. ముఖ్యంగా శిరస్త్రాణం లేకుండా వాహనం నడుపుతున్న 22 లక్షల ద్విచక్ర వాహనదారులపై జరిమానా విధించారు. గతేడాది కంటే ఇది దాదాపు నాలుగు లక్షల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడిపే 12 వేల మందికి జరిమానా విధించారు. ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ జరిమానా కట్టిన వారు గతేడాది 25 వేలు కాగా.. ఈ ఏడాది.. సుమారు 90 వేల మందికి జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న 10వేల మందికి జరిమానా విధించారు. గతేడాదితో పోలిస్తే ఇది 3000 అధికం. వాహనాల నెంబర్ ప్లేట్లు సరిగా లేకుండా ఉన్న 70 వేల వాహనాలకు జరిమానా విధించారు. ఈ ఏడాది ఇది మొదటి ఆరు నెలల్లో జరిగిన ప్రమాదంలో 106 ప్రమాదాల్లో 105 మంది మృతి చెందారు. గతేడాది మొదటి ఆరు నెలల్లో ఈ సంఖ్య 140 ఉండగా ప్రస్తుతం 23 శాతం తగ్గడం ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యల ఫలితమే. వాహనదారులు సైతం ట్రాఫిక్ నిబంధనలు పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించి ప్రమాదాల నివారణకు తోడ్పాటు అందించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.