ETV Bharat / state

పంజాగుట్ట ఫ్లైఓవర్​ పైనుంచి కిందపడి వ్యక్తి మృతి - ccident

అర్ధరాత్రి పంజాగుట్ట ఫ్లైఓవర్ పై నుంచి ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి కిందపడిపోయాడు.  ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు.

పంజాగుట్ట ఫ్లైఓవర్​ పైనుంచి కిందపడి వ్యక్తి మృతి
author img

By

Published : Jun 30, 2019, 9:16 AM IST

హైదరాబాద్ పంజాగుట్ట ప్లై ఓవర్​పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహమ్మద్ తాజుద్దీన్ అనే వ్యక్తి ఫ్లై ఓవర్​ పై నుంచి కింద పడ్డాడు. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మహమ్మద్ తాజుద్దీన్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్​పై ఉన్న కారు, ద్విచక్రవాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. మృతుడు ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నట్లు సమాచారం.

పంజాగుట్ట ఫ్లైఓవర్​ పైనుంచి కిందపడి వ్యక్తి మృతి

ఇవీ చూడండి: నేడు సభ్యత్వ నమోదు ఇం​ఛార్జీ​లతో కేటీఆర్​ భేటీ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.