సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో నిన్న అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఆటోలోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు డ్రైవరు వాహనాన్ని నిలపకుండా వెళ్లిపోయాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితులు ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రలను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్య