ETV Bharat / state

Air pollution: హైదరాబాద్‌లో క్షీణిస్తున్న గాలి నాణ్యత.. ముప్పు తప్పదంటున్న నిపుణులు - హైదరాబాద్‌ జిల్లా వార్తలు

వాతావరణ మార్పులతో జీహెచ్​ఎంసీ పరిధిలో రోజు రోజుకు కాలుష్యం పెరుగుతూనే ఉంది. హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల జిల్లాల్లో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజుల్లో అత్యధిక కాలుష్యం ఉండే దిల్లీ కంటే గాలి నాణ్యత పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Air pollution
Air pollution
author img

By

Published : Oct 25, 2021, 11:41 AM IST

వాతావరణంలో మార్పులతో హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల జిల్లాల్లో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. సెప్టెంబరులో ‘మంచి’ స్థితిలో ఉండగా, అక్టోబరు తొలి పక్షంలో సంతృప్తికర స్థితికి, ద్వితీయార్ధంలో మధ్యస్థ స్థితికి పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజుల్లో అత్యధిక కాలుష్యం ఉండే దిల్లీ కంటే గాలి నాణ్యత పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ వాయుకాలుష్య ప్రభావం పెరుగుతోంది. సాధారణంగా తెలంగాణలో నవంబరు-జనవరి మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి. ఈ పరిస్థితుల్లో గాలి నాణ్యత మరింతగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, గుండెజబ్బులు ఉన్నవారిపై ఎక్కువగా ఉంటుందని’ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పరిమితి దాటిన పీఎం 2.5

హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అతిసూక్ష్మ ధూళికణాలు (పీఎం 2.5) పరిమితికి మించి నమోదవుతున్నాయి. ఈ నెల 19వ తేదీ నాటి సీపీసీబీ గణాంకాల ప్రకారం.. సనత్‌నగర్‌లో పీఎం 2.5 స్థాయి 52.32 మైక్రో గ్రాములుగా, ఐడీఏ బొల్లారంలో 48.85, జూపార్క్‌లో 58, ఇక్రిశాట్‌ 41.71, సెంట్రల్‌ యూనివర్సిటీ 37.48, ఐడీఏ పాశమైలారం వద్ద 42.8 మైక్రో గ్రాములుగా నమోదయ్యాయి. (సీపీసీబీ ప్రమాణాల ప్రకారం పీఎం 2.5 గరిష్ఠ పరిమితి ఘనపు మీటరు గాలిలో 40 మైక్రో గ్రాములు మించకూడదు.

ఎందుకీ పరిస్థితి?

వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, చెత్తను కాల్చడం వంటి కారణాలతో వెలువడే సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 10), అతిసూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5), నైట్రోజన్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌డయాక్సైడ్‌ వంటి వాయువులు గాలిని కలుషితం చేస్తాయి. మామూలు రోజుల్లో కర్బన ఉద్గారాలు గాలిలో చెల్లాచెదురవుతాయి. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, గాలిలో తేమ ఉన్నప్పుడు మాత్రం ఇవి విడుదలైన ప్రాంతంలోనే కదలకుండా ఉండిపోతాయి. ఫలితంగా గాలి నాణ్యత క్షీణిస్తుంది. అది పీల్చిన వాళ్లకు ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.

ఇదీ చదవండి: Petrol Price Hike Effect: నడ్డివిరుస్తున్న ఇంధన ధరలు... కూరగాయలు, నిత్యావసరాలపైనా ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.