హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బియ్యం పంపిణీ చేశారు. భాజపా నాంపల్లి ఇంఛార్జీ దేవన కర్ణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమ పార్టీ ముందుండి ప్రతి ఒక్కరి కోసం పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము తప్పకుండా పాటిస్తామని ఆయన వివరించారు.
యూనిఫాం లేని పోలీసులు భాజపా కార్యకర్తలు. ముడి సరకులు, భోజన వితరణ సందర్భంలో జాగ్రత్తగా మెలగాలి. మీకు తెలిసిన వ్యక్తులు, సంస్థల ద్వారానే ఆహారం స్వీకరించండి. కరోనా వ్యాధి పట్ల ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయి. మేం ప్రభుత్వానికి సహకరిస్తాం. మాకు కూడా ప్రభుత్వం సహకరించాలి. భారతీయ జనతా పార్టీకి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తాం.
బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి : నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేస్తే ఏడేళ్లు జైలు!