ETV Bharat / state

అపోలో ఆసుత్రిలో వీహెచ్‌ను పరామర్శించిన రేవంత్‌రెడ్డి - telangana news

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో... వరుసగా కాంగ్రెస్ నేతలతో కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నేత వి.హనుమంతరావును కలిసి పరామర్శించారు. వీహెచ్ ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులను ఆరా తీశారు. అనంతరం నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్​కు వెళ్లి నివాళులర్పించారు.

వీహెచ్‌ను పరామర్శించిన రేవంత్‌రెడ్డి
వీహెచ్‌ను పరామర్శించిన రేవంత్‌రెడ్డి
author img

By

Published : Jun 28, 2021, 12:29 PM IST

మొదటి నుంచి తనను వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత హనుమంతు రావును నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కలిశారు. అనారోగ్యంతో హైదర్​గూడ అపోలో ఆసుత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కలిసి పరామర్శించారు. రేవంత్‌ రెడ్డితోపాటు మాజీ మంత్రి చిన్నారెడ్డి, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవిలు వీహెచ్ ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు.

ఉదయం.. మాజీ మంత్రి చిన్నా రెడ్డి మర్యాదపూర్వకంగా రేవంత్‌ రెడ్డిని ఆయన ఇంట్లో కలిశారు. అనంతరం అక్కడ నుంచి ఆసుత్రికి వెళ్లి వీహెచ్‌ను పరామర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు రేవంత్‌ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరిపై రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల పాలిట ద్రోహి అయిన కేసీఆర్‌తో అందరం కలిసి కొట్లాడదామని వీహెచ్‌తో చెప్పినట్లు రేవంత్ తెలిపారు. ఆరోగ్యం కుదటపడగానే తాను హనుమంతరావును దిల్లీకి తీసుకెళ్లి సోనియా, రాహుల్‌ గాంధీలతో కలుపుతానని తెలియజేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రెండు సంవత్సరాలల్లో...ఏ విధంగా కొట్లాడాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తామని, పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు విషయమై కచ్చితమైన కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నట్లు వీహెచ్‌కు తెలియజేసినట్లు వివరించారు.

పార్టీ సమష్టి నిర్ణయం మేరకు ముందుకెళ్తా..

పార్టీ నిర్ణయం మేరకే ముందుకు వెళ్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఏమీ ఉండవని అన్నారు. పార్టీ సమష్టి నిర్ణయం మేరకు ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ఏ నిర్ణయమైనా ఉమ్మడిగానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలను విడదీసి అధికారాన్ని పదిలం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం తాను అండగా ఉంటానని నూతన పీసీసీ చీఫ్ భరోసా ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా అండగా నిలుస్తానని రేవంత్ తెలిపారు.

ఇదీ చదవండి: డీలా పడ్డ కాంగ్రెస్​కు.. రేవంత్ టీం దిక్సూచిగా మారేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.